మంచి బాక్సాఫీస్ హిట్ సినిమాలను వదులుకున్న నాని.. అవి చేసి ఉంటే మరో లెవెల్లో ఉండేది

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతలకు ఎక్కువగా ఇలాంటి హీరోలతోనే వర్క్ చేయాలని ఉంటుంది. బడ్జెట్ విషయంలో రిస్క్ లేకుండా సినిమాలను సెలెక్ట్ చేసుకునే నాని ప్రతి ఏడాది తన మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే మార్కెట్ ఎంత పెరిగినా కూడా అతను రెమ్యునరేషన్ ను సడన్ గా అయితే పెంచి నిర్మాతలను రిస్క్ లో పడేయడం లేదు. ప్రస్తుతం నాని చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. ఇక నాని టక్ జగదీష్ సినిమా గురువారం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. అసలైతే సినిమాను థియేటర్స్ లోనే భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల అనుకిలించకపోవడంతో నిర్మాతలు ఆర్థిక కారణాల వలన అమెజాన్ ప్రైమ్ కు అమ్ముకోవాల్సి వచ్చింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఇది వరకే నిన్ను కోరి అనే సినిమా చేసిన నాని ఇప్పుడు టక్ జగదీష్ అనే మరో డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఈ సినిమా కూడా ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాని గతంలో కొన్ని మంచి సినిమాలను కూడా వదులుకున్నట్లు చెప్పాడు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని కూడా అందుకున్నాయి. ఆ సినిమాలు మరేవో కావు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మొదట వరుణ్ తేజ్ పాత్ర కోసం నానిని అనుకున్నారట. కానీ అప్పుడు బిజీగా ఉండడం వలన నాని ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. డేట్స్ అడ్జస్ట్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా వర్కవుట్ కాలేదట. ఇక నిర్మాత దిల్ రాజు ఆ సినిమా తొందరగా సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ చేసుకొని వరుణ్ తేజ్ ను సెట్ చేసి మొదలు పెట్టాల్సి వచ్చింది.

Hero Nani rejected box office stories few years back,

ఇక అంతకంటే ముందు తమిళ్ తెలుగులో ఒకేసారి బైలాంగ్యువల్ సినిమా చేయాలని దర్శకుడు అట్లీ రాజా రాణి సినిమాను నానితో కూడా చేయాలని అనుకున్నాడు. అందులో ఒక హీరో పాత్ర కోసం ఆఫర్ వచ్చిందట. అయితే నానిని ఏ పాత్ర కోసం అడిగారు అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. కానీ రాజా రాణి కథ ఆఫర్ వచ్చినప్పుడు తాను ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాతో బిజీగా ఉన్నాను అని నేచురల్ స్టార్ వివరణ ఇచ్చాడు. ఇక నాని చేతిలో ప్రస్తుతం మంచి సినిమాలు ఉన్నాయి అనే చెప్పాలి. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగర్ ఆయన అనే సినిమాను చేస్తున్నాడు. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే.. సుందరానికి అనే కామెడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలపై కూడా నాని నమ్మకంతోనే ఉన్నాడు. ఎలాగైనా థియేట్రికల్ గా విడుదల చేసి భారీ స్థాయిలో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X