ఆసక్తిని పెంచేసిన హీరో నాని ట్వీట్: రేపు రాబోయే సర్‌ప్రైజ్ దాని గురించేనా!

క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణాన్ని కొనసాగించి.. కొన్నేళ్లకు 'అష్టాచెమ్మా' అనే మూవీతో హీరోగా మారాడు నేచురల్ స్టార్ నాని. సహజ సిద్ధమైన నటనతో సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న అతడు.. ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోలుగా మార్చుకున్నాడు. తద్వారా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అదే సమయంలో అభిమానులను సైతం భారీగా పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు.

'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇందుకోసం అతడు ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఇవేమీ అతడికి ఆ తరహా విజయాన్ని అందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు నాని. ఇందులో భాగంగానే 'నిన్ను కోరి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమాలో నటించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. అనివార్య కారణాలతో ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు.

 Hero Nani Tweet Create Buzz on Tuck Jagadish

'టక్ జగదీష్' మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినా.. కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని యూనిట్ వెల్లడించకున్నా ఇటీవల 'లవ్ స్టోరీ' మూవీ నిర్మాతల వివాదాన్ని రేపడంతో ఇది కాస్తా బయటకు వచ్చింది. అదే సమయంలో పెద్ద రచ్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 'టక్ జగదీష్' నిర్మాతలు తమ సినిమా ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ సుదీర్ఘమైన లేఖను కూడా విడుదల చేశారు. దీంతో మిగిలిన వాళ్లు సైలెంట్ అయ్యారు.

'టక్ జగదీష్' మూవీ నుంచి ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ, ఇది వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నాని ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ స్టార్ హీరో తన ట్విట్టర్ ఖాతాలో 'రేపే' అని పోస్ట్ పెట్టాడు. దీంతో ఇది 'టక్ జగదీష్' మూవీ ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్ అయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పుడు భారీ బజ్ ఏర్పడింది. దీని కోసం నాని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆపక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Hero Nani Tweet Create Buzz on Tuck Jagadish

కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన 'టక్ జగదీష్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X