Naveen Chandra: తండ్రి అయిన హీరో నవీన్ చంద్ర.. పాదాలు ముద్దాడుతున్న ఫొటోలు వైరల్!
సీతా రామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా మారిన చిత్రం అందాల రాక్షసి. ఈ సినమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు నవీన్ చంద్ర. తర్వాతి కాలంలో హీరోగానే కాకుండా నెగటెవ్, సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. పాత్ర ఏదైనా తన నటనతో మాత్రం ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు నవీన్ చంద్ర. ఇటీవల కాలంలో ఎక్కువగా ఓటీటీ వేదికలపై సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాడు ఈ హీరో. అయితే తాజాగా ఈ హీరో గుడ్ న్యూస్ తెలిపాడు. నవీన్ సతీమణి ఓర్మా తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఆ సినిమాతో నటుడిగా..
టాలీవుడ్ మంచి నటుడుగా గుర్తింపు పొందాడు నీవీన్ చంద్ర. అయితే కర్ణాటక ఆర్టీసీలో హెడ్ మెకానికి కుమారుడు అయిన నవీన్ చంద్ర మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు. ఆ తర్వాత యానిమేషన్ లో శిక్షణ తీసుకుని యానిమేటర్ గా కొన్నాళ్లు పనిచేసిన తర్వాత సినిమాలపై ఇంట్రెస్టుతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నవీన్ చంద్ర. ముందుగా సంభవామి యుగే యుగే సినిమాలో నటుడిగా అవకాశం అందుకున్నాడు నవీన్ చంద్ర.

విభిన్న పాత్రలు చేసుకుంటూ..
సంభవామి యుగే యుగే తర్వాత కల్యాణం అని తెలుగు చిత్రంతోపాటు పళనియప్ప కళ్లూరి తమిళ మూవీ చేసిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నవీన్ చంద్ర. ఆ తర్వాతి కాలంలో కేవలం హీరోగానే కాకుండా విభిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగాడు నవీన్ చంద్ర.

సినిమాలు, సిరీస్ లతో..
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నెగెటివ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే నేను లోకల్, దేవదాస్, ఎవరు, అరవింద సమేత, వీర సింహా రెడ్డి వంటి చిత్రాలతో అలరించాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఓటీటీల హవా పెరగడంతో.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ సత్తా చాటుతున్నాడు. సూపర్ ఓవర్, పరంపర, పరంపర 2, అమ్ము, రిపీట్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు.

కెరీర్ పరంగా బిజీగా..
గతేడాది గని, విరాటపర్వం, రంగ రంగ వైభవంగా సినిమాల్లోనూ నటించగా.. ఈ ఏడాది వీర సింహా రెడ్డి సినిమాలో మంచి పాత్ర దక్కింది. ప్రస్తుతం తెలుగు, తమిళ ద్విభాష చిత్రంలో నటిస్తున్నాడు. మొత్తంగా యాక్టింగ్ కెరీర్ తో ఫుల్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నాడు నవీన్ చంద్ర.
గతేడాది వాలంటైన్స్ డేకు..
అయితే కర్ణాటకలోని బళ్లారికి చెందిన నవీన్ చంద్ర పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. తన పెళ్లి, భార్య గురించి ఎలాంటి వివరాలు ఇంతకుముందు తెలుపలేదు. గతేడాది వాలంటైన్స్ డేకు తన భార్య ఓర్మాను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశాడు. తాజాగా ఆయన పండంటి మగబిడ్డకు తండ్రి అయినట్లు తన సంతోషాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు.
పాదాలను ముద్దాడుతూ..
నేను, ఓర్మా మగబిడ్డకు తల్లిదండ్రులం అయ్యాం అంటూ రాసుకొచ్చాడు నవీన్ చంద్ర. అలాగే తన బాబు పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను పంచుకున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కాగా ప్రేక్షకులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. దీంతో ఆయన తండ్రి అయినవార్తతోపాటు ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











