రాబోయే మరో మూడు సినిమాలపై క్లారిటీ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి.. బడా సంస్థలతోనే..
టాలీవుడ్ లో ఈ ఏడాది బిగెస్ట్ ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో జాతిరత్నాలు టాప్ లిస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు. మొత్తానికి యువ హీరో నవీన్ పొలిశెట్టి ఆ సినిమాతో ఒక ట్రాక్ లోకి వచ్చేశాడు. ఇక రాబోయే సినిమాలు కూడా అదే తరహాలో ఉండాలని ఈ హీరో ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా రోజుల తరువాత నవీన్ భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో మంచి సక్సెస్
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నుంచి మంచి అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్న నవీన్ పొలిశెట్టి అనుకున్న సక్సెస్ చూడడానికి చాలా సమయం పట్టింది. బాలీవుడ్ లో చిచోరే సినిమాలో అతను చేసిన పాత్ర మంచి క్రేజ్ అందించింది. అయినప్పటికీ తెలుగులోనే మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

అసలైన సక్సెస్
ఇక విడుదలకు ముందే జాతిరత్నాలు సినిమా మంచి బజ్ క్రియేట్ చేయడంతో సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని అనుకున్నారు. కానీ మరీ ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఇక ఫైనల్ గా నవీన్ అనుకున్న అసలైన సక్సెస్ ను చూశాడు. అయితే ఆ సినిమా హిట్టుతో అతనిపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.

ఇంకెక్కడా ఏం చదివినా నమ్మకండి
జాతిరత్నాలు హిట్టయ్యింది కాబట్టి నవీన్ నుంచి తరువాత రాబోయే సినిమాలు కూడా అంచనాలు అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంతవరకు నవీన్ చేయబోయే భవిష్యత్తు ప్రాజెక్టులపై ఒక్క అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఇక నెక్స్ట్ రాబోయే మూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్ల చెబుతూ.. 'ఇంకెక్కడా ఏం చదివినా నమ్మకండి' అంటూ ట్వీట్ చేశాడు.

బిగ్గెస్ట్ ప్రొడక్షన్ లలో
బిగ్గెస్ట్ ప్రొడక్షన్ లలో నటించడం తన డ్రీమ్ అని చెప్పిన నవీన్ వాటి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. చూస్తుంటే నవీన్ పెద్ద ఆఫర్స్ పట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మహేష్ బాబు GMB ప్రొడక్షన్ లో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











