100 రావాలి: ఏపీ పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ గురించి నిఖిల్ హాట్ కామెంట్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ త్వరలో 'అర్జున్ సురవరం' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా నిఖిల్ ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిఖిల్‌కు ఏపీ పాలిటిక్స్‌ గురించిన ప్రశ్నలు ఎదురవ్వగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''అక్కడ వారు తలలు బద్దలు కొట్టుకుని ఎవరు గెలుస్తారో అనే టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్ ముందు నా సినిమా టెన్షన్ నథింగ్. ఎవరు గెలిచినా ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకం ఉంది.'' అన్నారు.

ముగ్గురూ ముగ్గురే...

ముగ్గురూ ముగ్గురే...

‘‘చంద్రబాబు నాయుడుగారు ఆల్రెడీ చాలా డెవల్మెంట్ చేశారు. జగన్ లాంటి యంగ్ లీడర్ ఏం చేస్తారనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఆయన చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. పాదయాత్రలు చేస్తూ ఎప్పుడూ జనాల్లో ఉంటున్నారు. మాకు ఇష్టమైన పవర్ స్టార్ ఏం చేస్తారో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఇది ఇండియన్ పాలిటిక్స్‌లో ఎగ్జైటింగ్ టైమ్. ఎవరు గెలిచినా బావుంటుంది. మే 23న ఏ విషయం అనేది తేలిపోతుంది.'' అన్నారు.

మీరు నన్ను తప్పు ప్రశ్న అడుగుతున్నారు

మీరు నన్ను తప్పు ప్రశ్న అడుగుతున్నారు

‘‘మీరు నన్ను తప్పు ప్రశ్న అడుగుతున్నారు. సినిమా ఎంత కలెక్షన్ చేస్తుందో అంటే చెప్పగలనేమో కానీ... ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది మాత్రం నాకు తెలియదు. చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు చాయిస్ ఉంది. ఎవరైనా సరిగా చేయకపోతే ప్రజలు వేరొకరిని ఎన్నుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ చాలా అలర్టుగా ఉంటారు. అందరూ కష్టపడతారు, అందరూ వర్క్ చేస్తారు. ఏ రాజకీయ నాయకుడు రిలాక్స్ గా ఉండరు.'' అంటూ మరొక ప్రశ్నకు నిఖిల్ సమాధానం ఇచ్చారు.

100 రావాలి

100 రావాలి

‘‘మీకు ఇష్టమైన పవర్ స్టార్ గారికి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? అనే ప్రశ్నపై స్పందిస్తూ... ‘‘ఆయన సినిమాలు 100 డేస్ ఆడతాయి. సీట్ల గురించి అయితే తెలియదు. ఆయన 100 డేస్ సినిమాలు ఎన్నో ఇచ్చారు. అలాగే 100 సీట్లు రావాలని కోరుకుందాం. ఎవరు గెలుస్తారనేది ముఖ్యం కాదు. ఎవరు గెలిచినా ప్రజలకు మంచి చేస్తారని నేను బాగా నమ్ముతున్నాను.'' న్యూట్రల్‌గా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు నిఖిల్.

అర్జున్ సురవరం

అర్జున్ సురవరం

నిఖిల్ మూవీ అర్జున్ సురవరం' మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ ‘అవెంజర్స్-ది ఎండ గేమ్' కారణంగా రిలీజ్ వాయిదా వేశారు. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేది ఖరారు కాలేదు.నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బి మ‌ధు సమర్పణలో ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. టి సంతోష్ దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X