twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2500 కేజీల బియ్యం, 3000 మందికి భోజనం.. తిత్లీ భాదితులకు యంగ్ హీరో సాయం!

    |

    శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. చాలా మంది ప్రజలు తుఫాన్ వలన తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది నిరాశ్రయులుగా మారారు. తుఫాన్ బాధితుల్ని ఆదుకునేందుకు టాలీవడ్ హీరోలు ఒక్కొక్కరుగా నడుం బిగిస్తున్నారు. తాజగా యంగ్ హీరో నిఖిల్ తుఫాన్ భాదితుల కోసం దగ్గరుండి సాయం చేశాడు.

    2500 కేజీల బియ్యాన్ని తుఫాన్ భాదితుల కోసం సరఫరా చేసాడు అంతే కాదు. దాదాపు 3000 మంది కోసం భోజనం కూడా ఏర్పాటు చేశాడు. గుప్పిడి పేట, పల్లి సారధి వంటి కొన్ని గ్రామాలలో నిఖిల్ స్వయంగా సహాయక చర్యలు చేపట్టాడు. తుఫాన్ బాధితులతో కలసి నిఖిల్ కూడా భోజనం చేయడం విశేషం.

     Hero Nikhil help to TitliCyclone victims

    ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్ వంటి హీరోలంతా తిత్లీ భాదితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. మరికొంతమంది సినీప్రముఖులు కూడా తుఫాన్ భాదితులకు ఆర్థిక సాయం అందజేయడానికి ముందుకు వస్తున్నారు.

    English summary
    Hero Nikhil help to TitliCyclone victims. Nikhil sends 2500 kg rice and food for 3000 people
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X