నేను రౌడీనా? ఎవరిపై దాడి చేయలేదు.. ఆమె ముద్దు పెట్టింది.. నిఖిల్

By Rajababu

Recommended Video

Hero Nikhil Says I'm Not a Rowdy

టాలీవుడ్ యువ హీరోలలో నిఖిల్‌ సిద్ధార్థ్‌ది ప్రత్యేకమైన శైలి. హ్యాపీడేస్‌తో సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన నిఖిల్ వరుస విజయాలను అందుకొన్నారు. హీరోగా రాణిస్తున్న నిఖిల్‌ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వాటి గురించి మీడియాతో మాట్లాడుతూ ఆ గొడవపై వివరణ ఇచ్చారు. తమ్ముడి కాలేజీలో జరిగిన గొడవపై ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే..

గొడవలో తలదూర్చాను

గొడవలో తలదూర్చాను

నా తమ్ముడి గొడవ వ్యవహారంలో నేను తలదూర్చిన విషయం నిజమే. కాలేజీలో ర్యాంగిగ్ చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారి సహాయంతోనే సమస్యను పరిష్కరించాం. కానీ మేము వ్యక్తిగతంగా ఎవరిపైనా దాడి చేయలేదు. నన్ను రౌడీ అంటే ఎప్పుకోను అని నిఖిల్ అన్నారు.

ర్యాగింగ్ చేస్తుంటే

ర్యాగింగ్ చేస్తుంటే

కాలేజీలో ర్యాంగింగ్ చేస్తుంటే నా తమ్ముడి తర్వాత స్పందించాను. కాలేజీలో నేను ఓ గ్యాంగ్‌ను చితక్కొట్టినట్టు వచ్చిన వార్తలో నిజం లేదు. నా తమ్ముడిని 16 మంది ర్యాగింగ్ చేసి కొట్టారు. అందుకే నేను స్పందించాల్సి వచ్చింది. మీడియాకు ఈ విషయంలో తప్పుడు సమాచారం అందింది.

ఓపెనింగ్స్‌కు వెళ్తుంటాను

ఓపెనింగ్స్‌కు వెళ్తుంటాను

షూటింగ్‌లను వదిలేసి షోరూం ఓపెనింగ్స్ వెళ్తానని అనడం వాస్తవం కాదు. ఛారిటీ ఈవెంట్ అయితే డబ్బులు తీసుకొను. కమర్షియల్ వాటికి డబ్బులు తీసుకొంటాను. నా బ్రాండ్ విలువను చెక్ చేసుకోవడానికి వెళ్తుంటాను.

సంయుక్త ముద్దు పెట్టడంపై

సంయుక్త ముద్దు పెట్టడంపై

కిరాక్ పార్టీలో హీరోయిన్ సంయుక్త హెగ్డేతో ముద్దు పెట్టించుకోవడం తప్పు కాదా అనే విషయంపై స్పందిస్తూ.. ఓ గేమ్ సందర్భంగా నాపై చెంపదెబ్బ కొట్టాలి. కానీ ఆమె నా బుగ్గపై ముద్దు పెట్టింది. అది ఫ్రెండ్లీగా జరిగిన సంఘటన మాత్రమే.

నేనెవరి వెంట పడలేదు

నేనెవరి వెంట పడలేదు

నేనెప్పుడూ సినిమా పరిశ్రమలో అమ్మాయిల వెంట పడలేదు. ఎవర్నీ ప్రేమించలేదు. నేను పెళ్లి చేసుకోవాలనుకొన్నప్పుడు అందరిని పిలిచి చేసుకొంటాను. ఒకటో తరగతి చదువుతున్నప్పుడు ఆయేషా అనే అమ్మాయితో తొలిసారి ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత ప్రేమలో పడిన దాఖలాలు లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X