Hero Nikhil: ఆర్ఆర్ఆర్‌ను తక్కువ చేసి మాట్లాడిన రిపోర్టర్.. దిమ్మతిరిగే జావాబిచ్చిన హీరో నిఖిల్
యంగ్ హీరోలలో వరుస హిట్లు సాధిస్తోన్న వారు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చింతంగా నిఖిల్ అనే చెప్పాలి. వరుస హిట్లను సాధిస్తూ నిఖిల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ యంగ్ హీరో స్క్రిప్ట్ సెలక్షన్ అందరి హీరోల కంటే భిన్నంగా ఉంటుంది.
అందుకే నిఖిల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలుస్తున్నాయి. కార్తీకేయ-2 తరువాత మరో ఆసక్తికరమైన సబ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నాడు. గ్యారీ అనే కొత్త దర్శకుడుతో స్పై అనే మూవీలో నిఖిల్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఆ వివారల్లోకి వెళ్తే...

హ్యాపీ డేస్‌తో కెరీర్ మొదలు: హ్యాపీ డేస్ సినిమాతో నిఖిల్ కెరీర్ మొదలు పెట్టాడు. మొదటి సినిమానే హిట్ కావడంతో..నిఖిల్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. కాని ఆ ఆఫర్లను హిట్లుగా మలచడంలో ఈ యంగ్ హీరో ఫెయిల్ అయ్యాడు. కెరీర్ మొదలుపెట్టిన చాలా ఏళ్లకు కాని నిఖిల్‌కు రెండో హిట్ దక్కలేదు.
2008లో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన యువత సినిమాతో రెండో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2013లో వచ్చిన స్వామిరారా సినిమా తరువాత నిఖిల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. అప్పటి నుంచి కంటిన్యూగా హిట్లు సాధిస్తూ.. తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు.

కార్తీకేయ 2తో ప్యాన్ ఇండియా హీరోగా: నిఖిల్ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే.. కార్తీకేయకు ముందు ఆ తరువాత అనే విభజించి మాట్లాడుకోవాలి. నిఖిల్-చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన మొదట చిత్రం కార్తీకేయ. 2014లో విడుదలైన ఈ సినిమాలో స్వాతి హీరోయిన్‌గా నటించింది. కార్తికేయ ఘన విజయం సాధించడంతో.. దీనికి సీక్వెల్‌ను తీయాలని చిత్ర యూనిట్ భావించింది.
దీనిలో భాగంగానే వీరి కాంబినేషన్‌లోనే 2022లో కార్తీకేయ సీక్వెల్ విడుదలైంది. కార్తీకేయ 2 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాకుండా ప్యాన్ ఇండియా లేవల్లో ఈ సినిమా సత్తా చాటింది. ఈ సినిమాతో నిఖిల్ 100 కోట్ల హీరోగా మారిపోయాడు.

ఆర్ఆర్ఆర్‌ను చులకన చేసిన రిపోర్టర్.. కౌంటరిచ్చిన హీరో నిఖిల్: ఇక నిఖిల్ తన కొత్త సినిమా స్పై టీజర్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది. అయితే ఈ సమయంలో రిపోర్టర్ మాట్లాడుతూ.. రాజమౌళి కూడా RRR సినిమాలో దేశ కోసం పోరాడిన కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల పేర్లను పెట్టుకుని ఫిక్షన్ సినిమా చేశారని..
నా వరకు RRR అనే సినిమా క్యాష్ చేసుకోవడానికే తీశారని.. మీరు కూడా సుభాష్ చంద్రబోస్‌ను అడ్డం పెట్టుకుని అలాంటి సినిమానే తీశారా అని హీరో నిఖిల్‌ను ప్రశ్నించారు. దీనికి నిఖిల్ సమాధానం ఇస్తూ..RRR అనే సినిమా దేశం గర్వించదగ్గ సినిమా అని..అస్కార్ అవార్డు సాధించి.. భారతదేశపు సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని చెప్పి ..అలా మాట్లాడటం సరికాదనే విధంగా ఆ విలేఖరి అడిగిన ప్రశ్నకు కౌంటరిచ్చారు.

జూన్ 28న ' స్పై' ప్రేక్షకుల ముందుకు: నిఖిల్ స్పై సినిమా దేశభక్తి జోనర్‌లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌లో ఇదే హైలేట్ అయ్యేలా చూపించారు. గ్యారి బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications











