కళ్ళముందే చనిపోయారు.. హీరో నిఖీల్ ఎమోషనల్, మోడీతో పాటు వాళ్ళందరికి ఇచ్చి పడేశాడు
టాలీవుడ్ యువ హీరో నిఖీల్ మొదటిసారి ఎమోషనల్ అవుతూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. కళ్ళముందే మనుషులు చనిపోవడం తనను ఎంతగానో కలచి వేసిందని బాధపడుతూ వివరణ ఇచ్చారు. నిఖీల్ ఇటీవల షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఒక మంచి పనితో బిజీ అయ్యాడు. అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Recommended Video

గాలి కంటే వేగంగా
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ గాలి కంటే వేగంగా వ్యాప్తిస్తోంది. నిమిషానికి ఒక వ్యక్తి మరణిస్తూ ఉండడం అందరిని కలచి వేస్తోంది. పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియని సందిగ్ధంలో కోట్లాది మంది కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సమయంలో కొంతమంది సెలబ్రెటీలు వారి వైవు నుంచి సహాయం అందిస్తున్నారు.

కళ్ళముందే చనిపోతున్నారు
హీరో నిఖీల్ ఈ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యాడు. తన స్నేహితులతో కొంతమందితో కలిసి అవసరమైన వారికి ఆక్సిజన్ లు వెంటిలేటర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఈ సమయంలో ఎంత సహాయం చేసినా కూడా సరిపోదు అంటూ కొంతమంది అయితే కళ్ళముందే చనిపోతున్నట్లు ఆవేదన చెందారు.

ఒక వ్యక్తికి ఫోన్ చేయగానే..
బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఫోన్ చేసిన కొద్దిసేపటికే ఆక్సిజన్ రెడీ చేశాము. కానీ మళ్ళీ సంప్రదింపులు జరిపే సరికి అప్పటికే అతను మరణించినట్లు తెలియజేయడం అందరిని షాక్ కు గురి చేసింది. అలాంటి మరణాలు చాలా బాధను కలిగిస్తున్నాయి.. అని నిఖీల్ ఎమోషన్ అయ్యాడు.
రాజకీయా నాయకులు అలా బిజీగా ఉన్నారు
పరిస్థితి చేయి దాటిపోతే ఎవరు కూడా మనకు సహాయం చేసే ఛాన్స్ లేదు. నిజానికి ఎంతోమంది సాధారణ ప్రజలే ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. కానీ రాజకీయాల నాయకులు మాత్రం ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు అంటూ వీడియో ద్వారా కౌంటర్ ఇచ్చిన నిఖీల్.. మోడీజీ కూడా మిగతా విషయాలపై కాకుండా ప్రస్తుత పరిస్థితులపై ఎక్కువగా ఫోకస్ పెడితే బావుంటుందని నిఖీల్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











