డ్రగ్స్ తీసుకోమని ఆఫర్.. నిఖిల్ సిద్ధార్థ్ సంచలన కామెంట్స్

సినీ రంగాన్ని కుదిపేస్తున్న మత్తుదందాలో ప్రముఖుల పేర్లు బయటకు రావడం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది సినీ ప్రముఖులు, వాళ్లతో సంబంధం ఉన్న వాళ్ల పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా డ్రగ్స్ కేసుపై పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించాడు. తనను డ్రగ్స్ తీసుకోవాలంటూ ఆఫర్ ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

డ్రగ్స్ గురించి కీలక వ్యాఖ్యలు : డ్రగ్ దుర్వినియోగం, డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఓ కార్యక్రమం నిర్వహించింది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రచారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిఖిల్ సిద్ధార్థ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Hero Nikhil Siddharth

ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది: నిఖిల్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ కి అందరూ దూరంగా ఉండాలని సూచించాడు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే, అదే డెత్ సెంటన్స్ అని చెప్పుకొచ్చాడు. విద్యార్థులకు అందమైన జీవితం ఉందని, ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని సూచించాడు. కానీ డ్రగ్స్‌ కి మాత్రం నో చెప్పండని తెలిపాడు. పార్టీలకు వెళ్లినా... అక్కడ డ్రగ్స్ మాత్రం తీసుకోవద్దు... కొందరు చేస్తున్న తప్పిదం వల్ల సినిమా ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుంది.. దాని కారణంగా కొందరు నిందితులుగా మారుతుండగా.. మరి కొందరు బాధితులుగా మిగులుతున్నారు.. అని చెప్పాడు నిఖిల్.

Hero Nikhil Siddharth

నన్ను తీసుకోమన్నారు: అయితే చాలా సార్లు తనని డ్రగ్స్ తీసుకోమ్మని ఆఫర్ చేశారని... కానీ తాను తీసుకోలేదని నిఖిల్ సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పరిణామాలు సమాజానికి మంచిది కాదన్నాడు. త్వరలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవ్వాలని తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నిఖిల్ చేసిన వ్యాఖ్యలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది.ఇప్పటికే కేపీ చౌదరి రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర వ్యాఖ్యలు బయటకు వచ్చాయి.

Hero Nikhil Siddharth

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు: కేపీ చౌదరి ఫోన్‌లో లభించిన ఫొటోల ఆధారంగా ఆయనకు చాలా మంది సినీ సెలెబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన పలువురితో వందకు పైగా ఫోన్ కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ లిస్టులో అషు రెడ్డి, సురేఖ వాణి, జ్యోతిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడీ కేసు టాలీవుడ్‌లో కలకలం రేపుతుండగా.. నిఖిల్ వ్యాఖ్యలు సైతం సంచలనం సృష్టిస్తున్నాయి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X