తండ్రైన హీరో నితిన్ .. బిడ్డ చేతివేళ్లను నిమురుతూ, పోస్ట్ వైరల్

టాలీవుడ్ హీరో నితిన్ వినాయక చవితి పర్వదినానికి ముందు శుభవార్త చెప్పారు. తన సతీమణి షాలిని కందుకూరి శుక్రవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో నితిన్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి తనయుడే నితిన్ . తండ్రి డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత కావడంతో ఆయనపై చిన్నప్పటి నుంచే సినిమాల ప్రభావం పడింది.

ఇంట్లో సినిమా వాతావరణం ఉండటంతో తను కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని అనుకున్నారు. దీనిలో భాగంగా తేజ దర్శకత్వంలో జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నితిన్. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు డెబ్యూ మూవీతోనే ఫిలింఫేర్ సౌత్ అవార్డ్ సొంతం చేసుకున్నారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్ రెడ్డి.. పవన్ బ్లాక్‌బస్టర్ మూవీ తొలిప్రేమ చూసి తాను కూడా హీరో కావాలని అనుకున్నారు. తనపై పవన్ ప్రభావం గట్టిగా ఉందని ఎన్నోసార్లు నితిన్ చెప్పారు. తన సినిమాల ఈవెంట్స్‌కు పవన్‌ను చీఫ్ గెస్ట్‌గానూ ఆహ్వానించి తన అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు నితిన్ నటించిన చల్ మోహన్ రంగ సినిమాకు పవన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. జయం బ్లాక్‌బస్టర్ తర్వాత నితిన్‌కు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. కానీ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు.

hero nitin and his wife shalini blessed with baby boy complete story

వీవీ వినాయక్ దర్శకత్వంలో దిల్, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన సై సినిమాలు ఘన విజయం సాధించడంతో నితిన్ రేస్‌లోకి దూసుకొచ్చారు. కానీ ఆ తర్వాత అల్లరి బుల్లోడు, ధైర్యం, రామ్, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, ద్రోణ, హీరో, రెచ్చిపో, అడవి, మారో, సీతారాముల కళ్యాణం లంకలో వంటి వరుస ఫ్లాప్స్‌తో నితిన్ వెనకబడిపోయాడు. ఈ దశలో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్‌తో మళ్లీ నితిన్ హీరోగా నిలబడ్డాడు. ఆ వెంటనే గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, అ ఆ, భీష్మ వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు.

తర్వాత చిన్నాదాన నీకోసం, కొరియర్ బాయ్ కళ్యాణ్, లై, చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణ, చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో మళ్లీ ఫ్లాప్స్ బాటపట్టాడు నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్ హుడ్, వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తమ్ముడు చేస్తున్నాడు నితిన్. ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ హిట్ కొట్టి బ్యాక్ బౌన్స్ అవ్వాలని ఆయన గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.

ఇదిలాఉండగా.. 2020లో తన చిరకాల స్నేహితురాలు షాలిన కందుకూరిని వివాహం చేసుకున్నారు నితిన్. నాలుగేళ్ల తర్వాత ఇటీవల తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు గుడ్‌న్యూస్ చెప్పింది ఈ జంట. తాజాగా శుక్రవారం షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ చేతిని నిమురుతూ నితిన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను తండ్రయిన విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు నితిన్ - షాలిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నితిన్ ఫ్యామిలీకి వినాయక చవితి గిఫ్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X