హీరోగా లైఫ్ ఇచ్చిన డైరెక్టర్‌కు నితిన్ బర్త్ డే విషెష్.. జయం సినిమాని గుర్తు చేసుకుంటూ!
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాలతో రాణిస్తున్నాడు. నితిన్ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. దాదాపు 10 ఏళ్ల పాటు నితిన్ నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. ఆ తర్వాత ఇష్క్ చిత్రంతో పుంజుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్లు పడడంతో క్రేజీ హీరోగా మారాడు. అసలు నితిన్ టాలీవుడ్ హీరోగా రాణిస్తున్నాడు అంటే అందుకు కారణం దర్శకుడు తేజ అని చెప్పొచ్చు.
నూనూగు మీసాల వయసులోనే తేజ నితిన్ ని జయం చిత్రంలో హీరోగా పరిచయం చేశాడు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో నితిన్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. శుక్రవారం తేజ పుట్టినరోజు సందర్భంగా నితిన్ జయం చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ తన డెబ్యూ దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. జయం చిత్రం ముహూర్తం సరిగ్గా ఇదే రోజున జరిగింది. ఫిబ్రవరి 22, 2002లో జయం చిత్రం లాంచ్ అయింది.

తేజ సర్ కు నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. జయంసినిమా నాకు మరచిపోలేని అనుభూతి అని నితిన్ ట్వీట్ చేశాడు. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











