Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఫ్లాపుల రికార్డు ఉన్నా నితిన్ డేరింగ్ స్టెప్: మరోసారి యూత్ స్టార్ అలాంటి ప్రయోగం
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలను అందుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇష్క్'తో హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు అప్పటి నుంచి కెరీర్‌ను సాఫీగా నడుపుకుంటున్నాడు. అయితే, ఈ ఏడాది ఇప్పటికే రెండు ఫ్లాప్‌లు (చెక్, రంగ్ దే) చవి చూసిన అతడు.. ఇప్పుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' అనే సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరొకరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
సుదీర్ఘమైన కెరీర్లో హీరో నితిన్ ఐదుగురు కొత్త దర్శకులను పరిచయం చేశాడు. అందులో నాలుగు సినిమాలు ఘోర పరాజయాలను చవి చూశాయి. దీంతో చాలా కాలంగా కొత్త దర్శకులతో అతడు సినిమాలు చేయడం లేదు.
అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు నితిన్.. ఒకరిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడట. అది ఎవరో కాదు.. చాలా ఏళ్ల నుంచి టాలీవుడ్లో ఎడిటర్‌గా పని చేస్తోన్న ఎస్ఆర్ శేఖర్ అని సమాచారం. కొద్ది రోజులుగా ఈయన దర్శకుడిగా మారడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల నితిన్‌కు ఓ కథ చెప్పగా.. అతడు వెంటనే ఓకే చేశాడని అంటున్నారు.
గతంలో కొత్త దర్శకులతో సరైన ఫలితాలను రాబట్టలేకపోయినా.. ఎడిటింగ్‌లో అనుభవం ఉన్న వ్యక్తి కావడం వల్లే ఎస్ఆర్ శేఖర్‌కు నితిన్ ఛాన్స్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని తెలిసింది. ఇదిలా ఉండగా.. నితిన్ నటిస్తోన్న 'మాస్ట్రో' షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతుంది. బాలీవుడ్లో బంపర్ హిట్ అయిన 'అంధాధున్'కు ఇది రీమేక్‌గా వస్తుంది. ఇందులో తమన్నా, నభా నటేష్ హీరోయిన్లు. నితిన్ సొంత బ్యానర్లో ఈ చిత్రం నిర్మాణం అవుతుంది.