Just In
Don't Miss!
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. పెళ్లికూతురు ఎవరంటే? పెళ్లి ఎప్పుడంటే?
హీరో నితిన్ ఓ పక్క తన తాజా చిత్రం భీష్మను రిలీజ్ చేయడానికి రెడీ అవుతూనే పెళ్లి పీటలెక్కుందకు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే నిర్మాత సుధాకర్ రెడ్డి ఇంటిలో నితిన్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. శనివారం ఉదయం కుంకుబొట్టు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకు నితిన్ పెళ్లి ఎప్పుడూ.. ఎక్కడ? వధువు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం ఇవే..

ఏప్రిల్ 16న వివాహం
టాలీవుడ్ హీరో నితిన్ వివాహం యూఎస్‌కు చెందిన శాలినితో ఏప్రిల్ 16వ తేదీన జరుగనున్నది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పెళ్లికి ముందు జరిగే సంప్రదాయమైన కార్యక్రమాలను, వేడుకలను ప్రారంభించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

యూఎస్‌కు చెందిన శాలినితో
ఇక నితిన్ చేసుకోబోయే పెళ్లికూతురు శాలిని యూఎస్‌కు చెందిన వారు. ఎంబీఏలో పట్టభద్రులయ్యారు. గత నాలుగేళ్లుగా నితిన్, శాలిని ప్రేమలో ఉన్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడం వెంటనే వారు అంగీకారం తెలపడంతో పెళ్లికి బాట పడింది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.

దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్
సినీ హీరో నితిన్, శాలిని పెళ్లిని ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నితిన్ పెళ్లి దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుగనున్నది. ఇందుకు సంబంధించిన బుకింగ్స్ మొదలైనట్టు సమాచారం. ఇప్పటికే సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసినట్టు తెలుస్తున్నది.
|
పెళ్లి తేదీలు ఖరారు..
నితిన్ పెళ్లి దుబాయ్‌లోని పలాజో వెర్సాసెలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుగనున్నది. ఏప్రిల్ 15వ తేదీన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, ఏప్రిల్ 16వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నట్టు తెలిసింది. త్వరలోనే అధికారికంగా పెళ్లి తేదీని వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే నితిన్ తన పెళ్లికి గురించిన విషయాన్ని ట్వీట్ చేశారు. పెళ్లి పనులు మొదలయ్యాయి. ముస్సిక్ స్టార్ట్స్. మీ దీవెనలు కావాలి అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

21న నితిన్ నటించిన భీష్మ మూవీ
ఇక హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలకు సిద్ధమవుతున్నది. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తన్న ఈ చిత్రానికి,వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు.