Don't Miss!
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News పవన్‌కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
సెన్సేషనల్ తమిళ చిత్రం రీమేక్‌లో నితిన్!
యంగ్ హీరో నితిన్ మళ్ళీ పరాజయాల బాట పట్టాడు. అ..ఆ చిత్రం తరువాత నితిన్ నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. నితిన్ చివరగా నటించిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది అని భావించిన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో నితిన్ తదుపరి చిత్రంతో విజయం సాధించడం కీలకంగా మారింది. ప్రస్తుతం నితిన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.
నితిన్ తదుపరి చిత్రాల గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన తమిళ చిత్రం రట్ససన్ చిత్రం సంచలన విజయం సాధించింది. విష్ణు విశాల్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. విడుదలై నెలరోజులు గడచినా ఆ చిత్రం గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు. థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ చిత్రం నితిన్‌ని బాగా ఆకర్షించిందట. దీనితో ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులని నితిన్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రామ్‌తోనా? నితిన్తోనా? క్లారిటీ ఇచ్చిన అజయ్ భూపతి
ఈ చిత్రంలో హీరో పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్ర రీమేక్ పట్టాలెక్కితే నితిన్‌ని పోలీస్ గెటప్ లో చూడవచ్చు. మరో ప్రచారం ప్రకారం ఈ చిత్రంలో నితిన్ నటించడని, కేవలం నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక వెంకీ కుడుముల, నితిన్ చిత్రం డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.