మరీ అంత ఫాస్ట్‌గానా?.. తిరుమలకు కాలినడకన నితిన్
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. వరుసగా సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. మామూలుగా అయితే 2020లోనే నాలుగు సినిమాలతో నితిన్ ప్రేక్షకులను పలకరించేవాడు. కానీ కరోనా రావడం లాక్డౌన్ పెట్టడంతో అంతా తారుమారైంది. అలా ఒక్క భీష్మ చిత్రంతో హిట్ కొట్టి సైలెంట్‌గా ఉన్నాడు. లేదంటే ఒకే ఏడాదిలో నితిన్ ఖాతాలో నాలుగు బ్లాక్ బస్టర్లు పడేవి. లాక్డౌన్ వల్ల వాయిదా పడ్డ సినిమాలన్నీ కూడా నితిన్ ఇప్పుడు మళ్లీ మొదలెట్టేశాడు.
మొదటగా నితిన్ రంగ్ దే షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో పడ్డాయి. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా దింపుతున్నాడు. ప్రస్తుతం నితిన్ చెక్ చిత్రంపై దృష్టిపెట్టేశాడు. ఆ తరువాత అంధాదున్ రీమేక్ పని పడతాడు. అయితే ఇప్పటికే అంధాదున్ షూటింగ్‌ను ప్రారంభించేశాడు నితిన్. మామూలుగా ఇంత బిజీగా ఉన్న నితిన్ నేడు కాలినడక తిరుమలకు వెళ్లాడు. అయితే క్షణం తీరిక లేకుండా ఉండే నితిన్ ఇలా తిరుమలలో ప్రత్యక్షమయ్యే సరికి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇక కాలి నడక హీరో వెళ్తే అక్కడ ఉండే హడావిడి అందరికీ తెలిసిందే. అయితే నితిన్‌కు మాత్రం అక్కడి భక్తులు పెద్ద ఇబ్బందిని కలిగించలేదని తెలుస్తోంది. దాదాపు మూడు వేలకు పైగా ఉన్న మెట్లను కేవలం రెండు గంటల 20 నిమిషాల్లోనే పూర్తి చేశాడంటే.. ఎలాంటి అసౌకర్యం కలగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ కాలినడకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











