ఎమ్మెల్యే టికెట్ కోసం కీలక నేతను కలిసిన స్టార్ హీరో.. అసలు విషయం ఇదా?

సినిమాలకు రాజకీయాలకు ఎవరూ విడదీయలేని అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమాల్లో రాణించినవారు... రాజకీయాల్లో నిలవాలని... రాజకీయాల్లో రాణిస్తున్న వారు అడపాదడపా సినిమాల్లో కనిపించాలనుకోవడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే టాలీవుడ్ లో టైర్ 2 హీరోల్లో ఉన్న నితిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

హీరో నితిన్ సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేసే సుధాకర్ రెడ్డికి కుమారుడిగా జన్మించారు. అయితే తన కుమారుడిని హీరోగా చూడాలని భావించిన సుధాకర్ రెడ్డి... దిల్ రాజు ప్రమేయంతో దిల్ అనే సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పటి నుంచి నితిన్ హీరోగా టాలీవుడ్ లో స్థిరపడిపోయారు.

hero nitin enters telangana politics news viral in social media

టైర్ 2 హీరోలలో ఒకరిగా అయినా అనేక సినిమాలు చేస్తూ వస్తున్నారు. చివరిగా మాచర్ల నియోజకవర్గం అనే ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా చేశాడు. కానీ ఇప్పుడు ఏకంగా నితిన్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. నిజానికి కొన్నాళ్ల క్రితం నితిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవ్వడం హాట్ టాపిక్ అయింది.

అయితే ఆ తర్వాత నిఖిల్ ను కలవాలనుకుని పొరపాటున నితిన్ ను జేపీ నడ్డా పిలిపించుకున్నారు అనే వార్త తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు నితిన్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగబోతున్నాడని ప్రచారం మొదలైంది. వాస్తవానికి నితిన్ నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సీటు మీద ఆయన కన్ను వేశాడు అంటూ టాలీవుడ్ వర్గాల్లో అలాగే పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే నిజానికి నితిన్ మేనమామ నగేష్ రెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉంటారు. ఆయన గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న ఆయన ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా చెబుతున్నారు. నగేష్ రెడ్డి కలిసిన సమయంలో నితిన్ కూడా తీసుకువెళ్లి తన మేనల్లుడు నితిన్ అవసరమైతే తనకు ప్రచారం చేస్తాడని రేవంత్ రెడ్డికి చెప్పించారని అయితే ఈ విషయం తెలియని వారంతా నితిన్ రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం అయితే చేస్తున్నారని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయితే ఇక్కడ నిజంగా నితిన్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా లేక రాజకీయాల మీద ఆసక్తి ఉన్న తన మేనమామను వెనక ఉండి నడిపించాలని అనుకుంటున్నారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇదంతా వట్టి ప్రచారమే కాగా అసలు నితిన్ నిజంగా రేవంత్ రెడ్డిని కలిశారా లేదా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఇక నితిన్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన స్వయంగా కలిసి క్లారిటీ ఇస్తే తప్ప ఈ విషయం మీద వస్తున్న వార్తలు ఇప్పట్లో ఆగే పరిస్థితి ఇదే కనిపించడం లేదు.

More from Filmibeat

Read more about: nithin నితిన్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X