Vaishnav Tej: ఆదికేశవా.. ఇక ఆలోచించాల్సిందే.. లెక్క తప్పితే చిక్కులు తప్పవు!
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అద్భుతమైన నటనతో అందరినీ అలరించగల సత్తా ఉన్న ఈ యంగ్ అండే డైనమిక్ హీరో.. బాల నటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టాడు. ముఖ్యంగా జానీ, శంకర్ దాదా ఎంబీబీఎస్, అందరి వాడు వంటి చిత్రాల్లో మేనమామల పక్కన నటించి మెప్పించాడు. బాల నటుడిగా 2005లో సిద్ధుగా కనిపించిన ఈయన పదిహేనేళ్ల తర్వాత అంటే 2020లో ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కృతి శెట్టితో కలిసి పల్లెటూరి యువకుడి పాత్రలో ఇరగదీశాడు.
ఆశీర్వాదం.. ఆసిగా కనిపించి అందరి చేత మన్ననలు పొందాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ కుర్ర హీరో కెరియర్ సెట్ అయిందని అంతా అనుకున్నారు. నిజానికి ఈ రేంజ్ లో డెబ్యూ అందకోవడం ఎవరి తరమూ కాదు. కానీ వైష్ణవ్ తేజ్ కు ఎక్కడ లేని అదృష్టం పట్టుకోగా.. మొదటి సినిమాతోనే ఫుల్ ఫేమ్ సంపాధించుకున్నాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ ఆయన ఫేవరెట్ హీరోగా మారిపోయారు. మొదటి సినిమా హిట్టుగా నిలివగా.. ఆ ఊపుతోనే మరికొన్ని చిత్రాలు చేశాడు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి కొండపొలంలో, రంగా రంగా వైభవంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా కలెక్షన్లు వసూలు చేయలేకపోయింది.

ఈక్రమంలోనే తాజాగా వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ మోస్ట్ క్యూట్ బ్యూటీ శ్రీలీలతో కలిసి ఆదికేశ సినిమాతో వచ్చారు. నవంబర్ 24వ తేదీ అంటే శుక్రవారం రోజే థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్ర నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఏమాత్రం బాగా లేదని అంతా అంటున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ కాలానికి తగ్గట్లుగా ఈ సినిమాను తెరకెక్కించలేకపోయారని టాక్ నడుస్తోంది. డివోషనల్ టచ్‌తో రూపొందిన ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు కానీ, మెగా అభిమానులు కానీ అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
ఇదంతా ఇలా ఉండగా.. ఇప్పటికే రెండు ఫ్లాప్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో మూడో సినిమాను కూడా ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఎంత పెద్ద హీరో అయినా సరే వరుసగా మూడు చిత్రాలు ఫ్లాప్ గా నిలిస్తే కెరియర్ కు చాలా కష్టంగా మారుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వైష్ణవ్ తేజ్ మంచి హిట్టుతో వస్తేనే ఏమైనా ఫలితం ఉంటుంది. లేదంటే ఎంత మంచి సినిమా అయినా సరే ఆయన చేశారంటే థియేటర్లకు కూడా వెళ్లరు జనాలు.

ఇందుకు బెస్ట్ ఉదాహరణ వరుణ్ తేజ్ యే. వరుసగా ప్లాపులకు పరిమితం అయిన ఆయన గాండీవదారి అర్జునతో వస్తే ఎవరూ థియేటర్లకు వెళ్లలేదు. దీన్ని బట్టి చూస్తుంటేనే.. వరుసగా ఫ్లాపులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. మరి ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న వైష్ణవ్ తేజ్ ఏం చేస్తాడో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











