Prithviraj Sukumaran: మాకు రెమ్యునరేషన్ తక్కువ, ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువ.. కానీ!

కోలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే సలార్ సినిమాలో వరదరాజ్ మన్నార్ గా కనిపించిన ఈయన తాజాగా ఆడుజీవితం సినిమాతో రాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దేశంలోని సినీ రంగాలపై షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తమ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్లు తక్కువగా ఉంటాయని.. సినిమా ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా రాబోతున్న తాజా సినిమా ఆడుజీవితం. బ్లెస్సీ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా మార్చి 28వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ వస్తున్న ఈ సినిమాకు హీరో బాగానే ప్రమోషన్లు చేస్తున్నారు. ముఖ్యంగా వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ సినీ ఇండస్ట్రీల గురించి మాట్లాడారు.

Hero Prithviraj Sukumaran Shocking Comments on Malayala Movie Industry Check Details

మలయాళ ఇండస్ట్రీలో సినిమా ప్రొడక్షన్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారని.. రెమ్యునరేషన్లు తక్కువ ఇస్తారని చెప్పారు. ముఖ్యంగా సినిమా నిర్మించే పూర్తి బడ్జెట్ లో ప్రొడక్షన్ కు ఎక్కువ శాతం వెళ్లగా.. రెమ్యునరేషన్ల కోసం తక్కువ శాతం డబ్బులు వస్తాయని చెప్పారు. అన్ని సినీ రంగాల్లో తాను పని చేసిన అనుభవంతోనే ఈ విషయం చెబుతున్నానని కూడా క్లారిటీ ఇచ్చారు. ఒక సినిమా బడ్జెట్ రూ.75 కోట్లు ఉంటే.. ఇతర ఇండస్ట్రీల్లో దాదాపుగా 55 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ల కోసమే ఉపయోగిస్తారని అన్నారు.

మిగిలిన పాతిక కోట్ల డబ్బులతోనే సినిమా తెరకెక్కిస్తారని.. కానీ మలయాళ ఇండస్ట్రీలో మాత్రం.. బడ్జెట్ లో ప్రధాన భాగం సినిమాలో నిర్మాణానికి వెళ్తుందని వివరించారు. ఇలా తమ ఇండస్ట్రీలో పారితోషికాలు తక్కువగా ఉంటాయని.. సినిమా బాగుండడం కోసం ఎంతైనా తాము ఖర్చు చేసేందుకు సిద్ధం అంటూ చెప్పుకొచ్చారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.

Hero Prithviraj Sukumaran Shocking Comments on Malayala Movie Industry Check Details

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఆడుజీవితం అందరికీ నచ్చుతుందని.. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ఓ వ్యక్తి జీవితాన్ని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించినట్లు వివరించారు. మార్చి 28వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాను అందరూ చూడాలని.. ఇలాగే తనను ఆదరిస్తే తెలుగులో కూడా హీరోగా సినిమాలు చేస్తానని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఆడుజీవితం సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X