సింగర్ చిన్మయి సీక్రెట్ వీడియో షేర్ చేసిన రాహుల్ రవీంద్రన్.. ఉచిత సలహా కూడా!

అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన అందగాడు.. రాహుల్ రవీంద్రన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్యూట్ గా చాక్లెట్ బాయ్ లా కనిపించే ఈయనకు ఈ ఒక్క సినిమాతోనే పెద్ద ఎత్తున క్రేజ్ వచ్చేసింది. ఆ ఒక్క సినిమాతోనే ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. కానీ ఆయన నిజజీవితంలో ప్రేయసిగా, భార్యగా మారింది ఓ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద. అయితే తాజాగా రాహుల్ తన భార్య సీక్రెట్ వీడియో షేర్ చేశాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి శ్రీపాద గురించి.. వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. అయితే భార్యకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసే ఆయన పర్సనల్ లైఫ్ లో వైఫ్ ను ప్రాణంగా చూసుకుంటారు. చాలా స్పషల్ కేర్ తీసుకుంటూ.. ఆమెను, ఇద్దరు కవల పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే తాజాగా ఈయన ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఓ అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. అందులో తన భార్య స్పెషల్ టాలెంట్ ను చూపించి.. సీక్రెట్ వీడియోను రివీల్ చేశారు.

Hero Rahul Ravindran Shares His Wife Singer Chinmay Secret Video Check Details

అయితే రాహుల్ రవీంద్రన్ షేర్ చేసిన ఈ వీడియోలో.. ఆయన భార్య చిన్మయి బాస్కెట్ బాల్ ఆడింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి హాయిగా గ్రౌండ్ లో గడిపిన ఆమె... మూడు సార్లు బాస్కెట్ బాల్ ను విసిరి ఫీల్డ్ గోల్ చేసింది. అది చూసిన రాహుల్ షాకయ్యాడు. ఫుల్ గా ఎంకరేజ్ చేశారు. అమ్మ త్రీ టైమ్స్ గోల్ చేసిందని పిల్లలకు చెబుతూ.. వీడియో తీస్తూ మరీ తెగ ఎగ్జైట్ అయిపోయాడు. ఆయన మాటలతో పాటు.. చిన్మయి ఆటను కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే చిన్మయి పాడిన ఓ పాటను కూడా వినచ్చు.

Hero Rahul Ravindran Shares His Wife Singer Chinmay Secret Video Check Details

అయితే మూడు బాల్స్ ను వరుసగా వేసి గోల్ చేసిన చిన్మయి.. ఇప్పటి వరకు బాస్కెట్ బాల్ ఆడలేదని.. ఇకపై ట్రై చేయమని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ముఖ్యంగా భార్యలోని హిడెన్ టాలెంట్ ను అందరికీ చూపించాలని ఈ వీడియోను షేర్ చేయగా.. కాసేపటికే వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజెన్లు అంతా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. చాలా బాగా ఆడుతుందని కొందరు, అద్భుతమైన గోల్ అంటూ మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X