’అడివి శేష్ సింగిల్ కాదు.. అంత మంది అమ్మాయిలతో అఫైర్‘
హీరోగా, డైరెక్టర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న రాహుల్ రవీంద్రన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ చాలా కూల్ గా ఉంటూ తన పని తాను చేసుకునే ఈయన తాజాగా హీరో అడివి శేషుపై షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఆయన ప్రేమకథలు, లవ్ అఫైర్స్ గురించి వివరించాడు. అంతా అనుకున్నట్లు ఆయన సింగిల్ కాదని చాలా మంది అమ్మాయిలతో అఫైర్ ఉందని వివరించాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కొనసాగుతున్న అడివి శేషు ఇప్పిటకీ సింగిల్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన, హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ లు ఓ షోకు వచ్చారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆహా ఓటీటీ సంస్థ కోసం చేస్తున్న చెఫ్ మంత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ తొలిసారి హీరో అడివి శేషు గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టారు.

అద్భుతమైన సినిమాలు చేస్తూ కెరియర్ లో దూసుకు పోతున్న అడివి శేషుకు ప్రస్తుతం 38 ఏళ్ల వయసు. ఇప్పటికీ సింగిల్ గా ఉన్న ఈయన కేవలం కెరియర్ పై మాత్రమే ఫోకస్ చేశారు. అందుకే కేవలం సినిమాలే చేస్తూ.. మరే విషయాలను పట్టించుకోవట్లేదు. ప్రేమ జోలికి కూడా పోలేదు. కానీ చెఫ్ మంత్ర షోకు వచ్చిన రాహుల్ రవీంద్రన్.. అడివి శేషు ప్రేమ కథల గురించి తెలిపాడు. ముందుగా షోకు రాగానే నిహారిక కొణిదెల వీరికి వెల్ కమ్ చెప్పింది.
రెచ్చిపోదాం బ్రదర్ అనే సాంగ్ కు ముగ్గురూ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత నిహారిక 8 తర్వాత వస్తుంది 9.. మా శేష్ సింగిల్ కాబట్టి వేసుకోవచ్చు లైన్ అంటూ అనగానే.. రాహుల్ రవీంద్రన్ నీకెవరు చెప్పారు మనోడు సింగిల్ అని.. వాడి మల్టిపుల్ అంటూ వివరించాడు. శేషుకు చాలా మంది అమ్మాయిలతో అఫైర్ ఉందంటూ జోక్ చేశాడు. దీనికి అడివి శేషుతో పాటు నిహారిక బాగా నవ్వేశారు. ఆ తర్వాత నీకు ఎవరైనా డాష్ చేయడానికి టిప్స్ అడిగారా అంటూ అనగా.. ఒడియబ్బా ఇవేం ప్రశ్నలురా బాబూ అంటూ రాహుల్ కడుపుబ్బా నవ్వాడు.

ఆ తర్వాత గేమ్ షోలో భాగంగానే ఈ ప్రశ్నలు అని తెలుసుని వెన్నెల కిషోర్ అని సమాధానం చెప్పాడు. దీనికి వెంటనే అడివి శేషు.. వెన్నెల కిషోర్ నీకు డాష్ చేసేందుకు టిప్స్ అడిగాడా అంటూ మళ్లీ అనగా అంతా నవ్వుతారు. ఇక ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక.. మీరు డాష్ చేయకుండా ఎన్ని రోజులు ఉండగల్గుతారు అంటూ అడగ్గా.. రాహుల్, శేషులు ఒకరినొకరు కొట్టుకుంటూ మరీ నవ్వేస్తారు. ఇలా ఫన్నీ ఫన్నీగా సాగిన ఈ షో ప్రోమో తాజాగా వచ్చింది. మీరూ కూడా ఓసాలి వెళ్లి చూసేయండి.


Click it and Unblock the Notifications











