గీత గోవిందంతోపాటు ఆ మూడు బ్లాక్‌బస్టర్ మూవీలను ఎందుకు చేయలేదంటే.. రాజ్ తరుణ్ పశ్చాత్తాపం

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవచ్చు అనేది అంత సులువైన విషయమేమీ కాదు. కానీ కొందరికి మాత్రం అలాంటి లక్కీ ఛాన్స్ లు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదేమైనా వచ్చిన అవకాశాన్ని వదిలి పెట్టకుండా కరెక్టుగా ఉపయోగించుకోగలిగితేనే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. ఇక ప్రస్తుతం అలాంటి దారిలో నడుస్తున్నాడు యువ హీరో రాజ్ తరుణ్. అయితే ఈ హీరో ఇండస్ట్రీలో కొన్ని మంచి అవకాశాలను కూడా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో వాటిపై వివరణ ఇచ్చాడు.

మంచి సినిమాలను మిస్ చేసుకున్నాడని..

మంచి సినిమాలను మిస్ చేసుకున్నాడని..

ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ అంతకుముందు చాలా రకాల షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఇక డైరెక్టర్ అవ్వాలని ఆశతో ఇండస్ట్రీలో అడుగు పెట్టగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సినిమాలోనే హీరోగా అవకాశం వచ్చింది. ఇక ఆ తరువాత వరుసగా సినిమా చూపిస్త మావ, కుమారి 21F వంటి సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఒకనొక సందర్భంలో మంచి మంచి సినిమాలను మిస్ చేసుకున్నాడని వచ్చిన రూమర్స్ పై ఈ హీరో అలీతో సరదాగా షోలో స్పందించాడు.

ట్యాక్సీవాలా రిజెక్ట్ చేయడానికి కారణం..

ట్యాక్సీవాలా రిజెక్ట్ చేయడానికి కారణం..

ట్యాక్సీవాలా', ‘గీత గోవిందం', ‘శతమానం భవతి', ‘నేను లోకల్‌' వంటి హిట్ కథలను రాజ్ తరుణ్ ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని అలీ ప్రశ్నించగా రాజ్ తరుణ్ ఈ విధంగా స్పందించాదు. మొదట ట్యాక్సీవాలా కథ బాగా నచ్చింది. కానీ హారర్ అనగానే కొంత వేరేలా అనిపించింది. ఇంతవరకు టచ్ చేయని ఆ జోనర్ అవసరమా అని అనుకున్నాను. అంతేగాని కథ నచ్చక రిజెక్ట్ చేయలేదు.

గీతగోవిందం, శతమానం భవతి ఎందుకు చేయలేదంటే..

గీతగోవిందం, శతమానం భవతి ఎందుకు చేయలేదంటే..

ఇక గీత గోవిందం సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశావని చాలా మంది నన్ను అడిగారు. కానీ ఆ ఆఫర్ నాకు అస్సలు రాలేదు. ఇక శతమానం భవతి గురించి ఇదివరకే చెప్పాను. ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను వరుసగా సినిమాలతో బిజీగా ఉండాల్సి వచ్చింది. ఆ కథ కూడా చేయాలని అనుకున్నాను. కానీ దిల్ రాజు గారు ఆ సినిమాను సంక్రాంతికి ఎలాగైనా రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకోవడం వలన నాకు డేట్స్ కుదరలేదు.

Recommended Video

Raj Tarun Disturbed Me A Lot - Malavika Nair
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే కథలు విన్నా..

నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే కథలు విన్నా..

నేను లోకల్ సినిమాను కూడా నేను రిజెక్ట్ చేయలేదు. ఆ సినిమా కథ రాసిన ప్రసన్న సినిమా చూపిస్త మావ సినిమాకు పని చేశాడు. తను ఏ కథ రాసిన నాతో షేర్ చేసుకుంటాడు. అలాగే నేను లోకల్ కథ కూడా నాతో ఫ్రెండ్లిగా చెప్పాడు. ఆ కథ కూడా నాకు బాజిక్ నచ్చింది. అయితే ఆ కథ నాతో చేయాలని వారు అనుకోలేదు. హలో గురు ప్రేమ కోసమే కథను కూడా ముందు నాకే చెప్పారు. ఆ విధంగా ఎలాంటి కథ రాసుకున్న ముందు నాతో చెబుతాడు. ఇక ట్యాక్సీ వాలా తప్పితే ఆ హిట్టు కథలను నేను రిజెక్ట్ చేయలేదని రాజ్ తరుణ్ చాలా ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X