దేశం గర్వించదగిన సినిమా ఆపరేషన్ రావణ్.. నచ్చకపోతే కాలర్ పట్టుకొని నిలదీయండి.. హీరో రక్షిత్ ఎమోషనల్
పలాస 1978 చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకొన్న యువ హీరో రక్షిత్ అట్లూరి నటించిన చిత్రం ఆపరేషన్ రావణ్. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రక్షిత్ అట్లూరి సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకొంటున్నఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ థ్రిల్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మారుతి, కళ్యాణ్ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ వేడుకలో హీరో రక్షిత్ భావోద్వేగంతో మాట్లాడుతూ... ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ రిలీజ్ వేడుకకు వచ్చిన దర్శకుడు మారుతి, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ థ్యాంక్యూ. ఈ మూవీ టెక్నీషియన్స్ గురించి తర్వాత ఈవెంట్స్‌లో మాట్లాడతాను. రాధిక శరత్ కుమార్ ఓ లేడి మెగాస్టార్. ఆపరేషన్ రావణ్ సినిమా కథ విని రాధిక శరత్ కుమార్ ఒప్పుకోవడమే తొలి సక్సెస్ అని భావించాం. ఆమె అనుభవం ముందు ఎందుకు పనికి రాము అని అన్నారు.

వెంకట సత్య వర ప్రసాద్ .. మా నాన్నగారు.. నా ప్రాణం.. ఈ చిత్రానికి దర్శకుడు. 1995లో స్వీట్ మ్యాజిక్ స్థాపించారు. అప్పుడు ఏం లేదు. కానీ ఇప్పుడు కొన్ని వేలమందికి ఉద్యోగం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో స్వీట్ మ్యాజిక్ గురించి తెలియని వారు ఉండరు అని హీరో రక్షిత్ అన్నారు.
సినిమాపై తపనతో ఆపరేషన్ రావణ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారత దేశం అంతా గర్వించే దగ్గ సినిమా అవుతుంది. ఏదో డైరెక్షన్ అంటే డైరెక్షన్ చేశారు అని కాకుండా.. అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకుని చేశారు. అందరికంటే ముందే ఉదయమే సెట్స్‌లో ఉండేవారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా ఈ కాన్ఫిడెంట్ కు కారణం అదే.
పలాస గురించి ఓ కాలేజ్ ఈవెంట్ లో చెప్పాను. ఈ సినిమా చూడండి.. చూశాక నచ్చకపోతే నా కాలర్ పట్టుకోండి అని. ఇప్పుడు అంతకు మించిన కాన్ఫిడెన్స్ తో చెబుతున్నాను. నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందీ సినిమా. చాలా పెద్ద దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తారో అలా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రయాణంలో మా తమ్ముడు, మా అమ్మ సపోర్ట్ మరలవలేనిది.. థ్యాంక్యూ.. " అన్నారు.


Click it and Unblock the Notifications











