ఇంటర్ రిజల్ట్స్ దానితో సమానం.. లైట్ తీసుకోండి.. హీరో రామ్ ఘాటుగా!

తెలంగాణాలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకల వల్ల విద్యార్థుల ఫలితాలు తారుమారు అయ్యాయనే విమర్శలు అధికం అవుతున్నాయి. దాదాపు 15 మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనితో టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా ఈ ఘటనపై స్పదింస్తున్నారు. హీరో రామ్ తరచుగా సమాజంలో చోటు చేసుకుంటున్న సంఘటనల గురించి తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా రామ్ తనదైన శైలిలో స్పందించాడు.

రామ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇంటర్ ఫలితాలే జీవితం అనుకునే నా తమ్ముళ్ళకి, చెల్లెళ్లకి చెబుతున్నా.. మీరు జీవితంలో కాబోయేదానికి, చేయబోయే దానికి ఇది ఆ*** తో సమానం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. దయచేసి లైట్ తీసుకోండి. ఇట్లు.. ఇంటర్ కూడా పూర్తి చేయని మీ రామ్ అని కామెంట్ పెట్టాడు. చివర్లో ఇంటర్ బోర్డు హత్యలు అంటూ సంచలన హ్యాష్ టాగ్ జత చేశాడు.

Hero Ram bold comments on Inter results and Students suicides

ఇంటర్ ఫలితాలపై, విద్యార్థుల ఆత్మహత్యలపై ఇప్పటికే సినీ దర్శకుడు మారుతి, సాయిధరమ్ తేజ్, కోనవెంకట్, హరీష్ శంకర్ లాంటి సెలెబ్రిటీలు స్పందించారు. అందరూ పరీక్షా ఫలితాలకు మించిన జీవితం ఎంతో ఉందని, విద్యార్థులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. హీరో రామ్ ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X