డ్రీమ్ ప్రాజెక్టుపై స్పందించిన రామ్ చరణ్.. ఒకసారి అలా మిస్సయ్యిందట
స్టార్ హీరోలు ఎవరైనా సరే ఎప్పటికైనా ఒక డ్రీమ్ ప్రాజెక్టును చేయాలని చాలా ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇక ఈ రోజుల్లో స్టార్ హీరోలకు ఒక విధంగా డ్రీమ్ ప్రాజెక్టును సెట్ చేసుకోవడం అంటే అంత పెద్ద కష్టమేమీ కాదు గాని అందుకు తగ్గట్టుగా సరైన కథలు దొరకడం కాస్త కష్టమే. దానికి కూడా అదృష్టం చాలానే ఉండాలి. ఇక రామ్ చరణ్ కూడా తన కలల ప్రాజెక్ట్ ని ఎప్పటికైనా సెట్స్ పైకి తెస్తానని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
మెగా తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ రామ్ చరణ్ తనకంటూ మెగా పవర్ స్టార్ అని ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఓ వైపు మెగాస్టార్, మరోవైపు పవర్ స్టార్ అభిమానుల సపోర్ట్ కూడా బలంగా ఉండడంతో చరణ్ మార్కెట్ కూడా అంతకంతకు డబుల్ అవుతోంది. ఇక రంగస్థలం సినిమాతో నటుడిగా తానేంటో నీరూపించుకున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఇటీవల ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఏదైనా ఒక మంచి సినిమా చేయాలనేది నాకున్న ఒక ప్రత్యేకమైన కల అంటూ వివరణ ఇచ్చారు. అలాంటి కథలో మన టాలెంట్ ని ఎక్కువగా చూపించే ఛాన్స్ ఉంటుందని అన్నాడు. గతంలో మెరుపు అనే సినిమాను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కాల్సింది కానీ అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయిందని రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ స్టార్ హీరో RRR సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











