నా సినిమా అంతగా సంతృప్తి పరచలేదు.. వడ్డీతో సహా తిరిగిస్తా.. హీరో రామ్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ చివరగా హలో గురు ప్రేమకోసమే చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కొందరు ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది. రొమాంటిక్ ఎన్టీఆర్ టైనర్ గా వచ్చిన హలొ గురు ప్రేమ కోసమే చిత్రంలో రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.
తాజాగా రామ్ ట్విట్టర్ లో తన అభిమానులని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. హలొ గురు ప్రేమ కోసమే చిత్రం మీకు అంతగా సంతృప్తిని కలిగించలేదు. అయినా కూడా సపోర్ట్ చేసి హిట్ చేశారు. అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా నా అభిమానులకు అని రామ్ ట్వీట్ చేశాడు.

ఈసారి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తా అంటూ ట్వీట్ చేశాడు. రామ్ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికాగా మారింది. రామ్ కొత్త సినిమా ఎవరి దర్శకత్వంలో అనే ఉత్కంఠ ఎక్కువుతోంది. అందులోనూ ఇటీవల రామ్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నాడు.


Click it and Unblock the Notifications











