రామ్ కొత్త సినిమా ఖరారు.. మరోమారు పూరితో కలసి చార్మి!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ చివరగా నటించిన హలొ గురు ప్రేమ కోసమే చిత్రం పరవాలేదనిపించింది. కానీ రామ్ కు సంతృప్తికర విజయం దక్కలేదు. నేను శైలజ తరువాత మరో భారీ హిట్ కోసం రామ్ ప్రయత్నిస్తున్నాడు. రామ్ త్వరలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ పూరికనెక్ట్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు. సీనియర్ హీరోయిన్ చార్మి ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనుంది. గతంలో మెహబూబా చిత్రానికి కూడా చార్మి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. జనవరిలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మేలో విడుదల చేయనున్నారు.

చార్మి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఇటీవల పూరిజగన్నాథ్ కు కూడా సరైన విజయం లేదు. దీనితో రామ్, పూరి ఇద్దరికీ ఈ చిత్రం కీలకం కానుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర నటీ నటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో వివరాలు వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











