మాటల మాంత్రికుడితో రామ్.. అలాంటి సినిమా కావాలట!
టాలీవుడ్ లో నెవర్ బోఫోర్ అనే కాంబినేషన్స్ లో సినిమాలు చాలానే వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రెగ్యులర్ హీరోలను పక్కనపెట్టి వేరే హీరోలతో వర్క్ చేయాలని ట్రై చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తరువాత వీలైనంత వరకు ఒక చిన్న హీరోతో మిడియమ్ బడ్జెట్ సినిమాతో రావాలని అనుకుంటున్నాడు. అయితే అది తారక్ సినిమా కంటే ముందే కూడా జరగవచ్చు.
అసలు మ్యాటర్ లోకి వస్తే యువ కథానాయకుడు రామ్ పోతినేని పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ చేసిన అనంతరం ఎలాగైనా మరో పెద్ద దర్శకుడితో వర్క్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక స్రవంతి ఫిలిమ్స్ తో చక్కటి అనుబంధం ఉన్న త్రివిక్రమ్ ని ఈసారి ఎలాగైనా ఒక సినిమాకు ఒప్పించాలని అనుకుంటున్నాడు. రామ్ హోమ్ బ్యానర్ అయిన స్రవంతి ఫిలిమ్స్ గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తున్నప్పటికీ వర్కౌట్ కావడం లేదు.

వరుసగా పెద్ద హీరోలతో సినిమా చేయడం వలన రామ్ కోసం కథను సెట్ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ఆ మధ్య నితిన్ అఆ బాగానే వర్కౌట్ అయ్యింది కాబట్టి రామ్ తో కూడా అలాంటి కథను అనుకుంటున్నారట. కానీ రామ్ కు మాత్రం అలాంటి సినిమా వద్దని చెబుతున్నట్లు టాక్.
చేస్తే జులాయి లాంటి యాక్షన్ అండ్ మైండ్ గేమ్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మరి రామ్ కోరిక మేరకు త్రివిక్రమ్ తన రేంజ్ ని పక్కనపెట్టి వర్క్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడా లేదా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











