Ram Pothineni: పెళ్లి వార్తలపై మొదటిసారి స్పందించిన హీరో రామ్.. ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఇటీవల కొన్ని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అలాగే పలు వెబ్ సైట్స్ లలో అయితే అమ్మాయి కూడా ఫిక్స్ అయిందని చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంపై రామ్ అభిమానులలో అయితే కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక ఫైనల్ గా హీరో రామ్ మొత్తానికి ఆ విషయాల్లో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సోషల్ మీడియాలో రామ్ పోతినేని ఈ విధంగా స్పందించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదట్లో అలా..

మొదట్లో అలా..

దేవదాసు సినిమాతో కథానాయకుడిగా కెరీర్ ను మొదలు పెట్టిన రామ్ మొదటి నుంచి కూడా భిన్నమైన తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట్లో ఎక్కువగా లవ్ స్టోరీస్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో మార్కెట్ ను పెంచుకున్న రాము ఆ తర్వాత మెల్లగా మాస్ ప్రేక్షకులను కూడా తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ..

ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ..

రామ్ పోతినేని ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ను హైలెట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా అతని యాక్షన్స్ సన్నివేశాలు డాన్స్ లు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే రామ్ పోతినేని కి బాక్సాఫీస్ వద్ద మార్కెట్ అంతకంతకు పెరుగుతూనే ఉంది ఇటీవల కాలంలో అయితే మాస్ ఆడియెన్స్ ను ఎక్కువగా కట్టుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు.

మరో మాస్ సినిమా

మరో మాస్ సినిమా

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్లీ అదే తరహాలో ముందుకు సాగాలని మరిన్ని విభిన్నమైన మాస్ యాక్షన్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

 చిన్నప్పటి క్లాస్మెట్ తో పెళ్లి?

చిన్నప్పటి క్లాస్మెట్ తో పెళ్లి?

అయితే ది వారియర్ సినిమా అవ్వగానే రామ్ పోతినేని ఒక ఇంటి వాడు కాబోతున్నాడు అని.. అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలుబడ్డాయి. ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు అంటూ రామ్ తో చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు అని దాదాపు వారి కుటుంబాల సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ఎన్నో రూమర్లు వినిపించాయి.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
ఓ దేవుడా! ఆపండి!

ఓ దేవుడా! ఆపండి!

అయితే ఫైనల్ గా రామ్ పోతినేని ఆ విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. 'ఓ దేవుడా! ఆపండి! ...నేను ఏ "సీక్రెట్ హైస్కూల్ ప్రియురాలిని" పెళ్లి చేసుకోనని నా స్వంత ఫ్యామిలీని అలాగే స్నేహితులను ఒప్పించాల్సిన స్థితికి చేరుకుంది..' అంటూ ప్రస్తుతం వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అన్నాడు. అలాగే నిజాయితీగా చెప్పాలంటే నేను హై స్కూల్ కు రెగ్యులర్ గా వెళ్లింది లేదని.. ట్విట్టర్ లో రామ్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X