Ram Marriage: హీరో రామ్ పెళ్లి ఫిక్స్.. ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ ఆ నెలల్లోనే.. అమ్మాయి వివరాలు తెలిస్తే!
సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా.. తనలోని అన్ని టాలెంట్లను నిరూపించుకోవడంతో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. దీనికితోడు ఆరంభంలోనే చాలా హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు.
ఇప్పుడు కూడా ఓ క్రేజీ ప్రాజెక్టును చేస్తున్నాడు. ఇలా కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న రామ్.. పెళ్లితో పర్సనల్ లైఫ్‌ను కూడా విజయవంతం చేసుకోబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ అతడు ఎవరిని పెళ్లాడబోతున్నాడు? ఆ వివరాలు మీకోసం!

అలా వచ్చి.. రేంజ్ పెంచుతూ: రామ్ పోతినేని 'దేవదాసు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఈ యంగ్ హీరో చాలా సినిమాలు చేశాడు. అందులో ఎక్కువ శాతం విజయాలు సాధించాయి. దీంతో ఇతగాడికి మంచి పేరు దక్కింది. అలాగే, మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇలా క్రమంగా సినిమాలు చేస్తూ రేంజ్ పెంచుకున్నాడు.

అప్పటి నుంచి కెరీర్ స్పీడ్‌గా: చాలా కాలం పరాజయాలతో సతమతం అయిన రామ్.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసి రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత అతడు 'రెడ్' కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు.

బోయపాటితో యాక్షన్ మూవీ: రామ్ - లింగుసామి కాంబినేషన్‌లో వచ్చిన 'ది వారియర్' ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న ఈ యంగ్ హీరో.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైంది. మిగిలిన పనులు కూడా త్వరగా కంప్లీట్ చేసి దీన్ని అక్టోబర్‌లో రిలీజ్ చేయబోతున్నారు.

రామ్ పెళ్లి గురించి ప్రచారం: టాలీవుడ్‌లోని యంగ్ హీరోలంతా ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవలే శర్వానంద్ వివాహం చేసుకోగా.. వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరి చూపు రామ్‌పై పడింది. ఫలితంగా కొద్ది రోజులుగా ఇతగాడి పెళ్లి గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో ఊహాగానాలు తెరపైకొచ్చాయి.

రామ్ పోతినేని మ్యారేజ్ ఫిక్స్: కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న హీరో రామ్ పోతినేని పెళ్లి గురించి చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడి వివాహం గురించి మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. హీరో రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని కూడా తెలిసింది.

రామ్ పెళ్లాడేది ఎవరినంటే: హీరో రామ్ సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తాజాగా తెలిసింది. అతడు హైదరాబాద్‌లోని ఓ పేరున్న బిజినెస్‌మ్యాన్ కూతురిని వివాహం చేసుకోబోతున్నాడట. ఆమె కొన్ని కోట్ల ఆస్తులకు వారసురాలని తెలిసింది. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చినది కావడంతో త్వరలోనే వాళ్ల నుంచి ప్రకటన వస్తుందట.

నిశ్చితార్థం, వివాహం కూడా: తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. హీరో రామ్ పెళ్లి ఈ ఏడాదే జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట. వచ్చే ఆగస్టులో నిశ్చితార్థం జరపాలని పెద్దలు నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వీళ్లిద్దరి వివాహం కూడా జరిపించాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. అంటే.. త్వరలోనే రామ్ పోతినేని కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడన్న మాట.


Click it and Unblock the Notifications











