India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ram Marriage: ప్రియురాలితో హీరో రామ్ పెళ్లి.. నిశ్చితార్థం, వివాహం అప్పుడే.. అమ్మాయి ఎవరంటే!

  |

  బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఫాలోయింగ్, మార్కెట్‌ను కూడా బాగా పెంచుకున్నాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రామ్.. వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో హీరో రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాలేంటో మీరే చూడండి!

  అలా పరిచయం.. ఎనర్జిటిక్ స్టార్‌గా

  అలా పరిచయం.. ఎనర్జిటిక్ స్టార్‌గా

  హీరో రామ్ పోతినేని 'దేవదాసు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అది సూపర్ హిట్ అవడంతో పాటు అతడికి ఎనర్జిటిక్ స్టార్ బిరుదును తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఈ యంగ్ హీరో చాలా సినిమాలు చేశాడు. అందులో ఎక్కువ శాతం విజయాలు సాధించాయి. దీంతో ఇతగాడికి మంచి పేరు దక్కింది. ఆ తర్వాత ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేశాడతను.

  హాట్ షోలో గీత దాటిన సీరియల్ నటి: ఆమెనిలా చూస్తే మతి పోవడం ఖాయం

  వరుస ఫ్లాపులు.. హిట్ ట్రాక్ ఎక్కేసి

  వరుస ఫ్లాపులు.. హిట్ ట్రాక్ ఎక్కేసి

  ఆ మధ్య పరాజయాలతో సతమతం అవుతోన్న రామ్‌.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసి రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత అతడు 'రెడ్' కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

  ద వారియర్‌గా మారిపోయిన రామ్

  ద వారియర్‌గా మారిపోయిన రామ్

  హీరో రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో 'ద వారియర్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. పవర్‌ఫుల్ కాప్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

  యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్

  బోయపాటితో జత కట్టిన స్టార్ హీరో

  బోయపాటితో జత కట్టిన స్టార్ హీరో

  రామ్ - లింగుసామి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా జూలైలో విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగానే ఈ స్టార్ హీరో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఇది రెగ్యూలర్ షూట్ జరుపుకోనుంది.

  పెళ్లికి సిద్ధం అవుతోన్న హీరో రామ్

  పెళ్లికి సిద్ధం అవుతోన్న హీరో రామ్

  వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న హీరో రామ్ పోతినేని పెళ్లి గురించి చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడి వివాహం గురించి మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. హీరో రామ్ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాడట. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారట.

  స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన హీరోయిన్: గతంలో చూడని విధంగా అందాల విందు

  నిశ్చితార్థం, వివాహం డేట్లు ఫిక్స్

  నిశ్చితార్థం, వివాహం డేట్లు ఫిక్స్

  తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. హీరో రామ్ పెళ్లి ఈ ఏడాదే జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పుడు ఆషాడ మాసం ఉన్న కారణంగా వచ్చే ఆగస్టులో నిశ్చితార్థం జరపాలని పెద్దలు నిర్ణయించుకున్నారని తెలిసింది. అలాగే, కార్తీక మాసంలో అంటే వచ్చే నవంబర్‌లో రామ్ పెళ్లి జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట. త్వరలోనే దీనిపై ప్రకటన రాబోతుందని సమాచారం.

  రామ్ పెళ్లాడేది ఎవరినో తెలిస్తే!

  రామ్ పెళ్లాడేది ఎవరినో తెలిస్తే!

  హీరో రామ్ సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, అందులో నిజం లేదని తాజాగా తెలిసింది. చాలా కాలంగా ఈ స్టార్ హీరో తన చిన్ననాటి స్నేహితురాలితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట. ఇప్పుడు ఆమెనే అతడు వివాహం చేసుకోబోతున్నాడని తెలిసింది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

  English summary
  Tollywood Star Hero Ram Pothineni Ready To Marriage. Latest Reports Says.. He Will Marry His Girlfriend in November.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X