Rana Daggubati ఆ బాలీవుడ్ బ్యూటీతో హీరో రానా ఎఫైర్? సీక్రెట్ రివిల్ చేసిన హీరో
టాలీవుడ్ యంగ్ హీరో రానా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీతో ఎఫైర్ నడిపారంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతే కాదు.. బ్యూటీ ముంబయి నుంచి రానా బర్త్ డే కోసం హైదరాబాద్ వచ్చింది. వీరిద్దరు ముంబైలో ఒకే ఫ్లాట్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. మరి వీటిపై రానా క్లారిటీ ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
టాలీవుడ్ యంగ్ హీరో రానా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో రానా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. లీడర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత పలు వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం, రుద్రమదేవి, బాహుబలి, భీమ్లానాయక్, బాహుబలి 2, నేనే రాజు నేనే మంత్రి వంటి క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించాడు.

2017లో బాహుబలి 2లో ఆయన నటనకు ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డు సైతం వచ్చింది. ఇక హిందీలోనూ పలు సినిమాల్లో రానా నటించాడు. అయితే అక్కడి బాలీవుడ్ బోల్డ్ బ్యూటీతో ప్రేమలో ఉన్నట్లు చాలా సార్లు కథనాలు బయటకు వచ్చాయి. వీళ్లిద్దరు కొన్నాళ్ల పాట డేటింగ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో గాసిప్స్ వినిపించాయి. ముఖ్యంగా రానా కోసం ముంబయి నుంచి బిపాస హైదరాబాద్ కు వచ్చిందని వీరి మధ్య ఎఫైర్ ఉందని టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలపై రానా క్లారిటీ ఇచ్చాడు.
ఒక ఇంటర్వ్యూలో రానా పాల్గొనగా బిపాసబసుతో ఎఫైర్ మీద వచ్చిన వార్తల గురించి స్పందించాడు. అది బాంబే కాబట్టి అలాంటి రూమర్స్ వచ్చాయి. ఆ విషయంలో అస్సలు నిజం లేదు. ఆమె నాకు డియర్ ఫ్రెండ్. నాకు తనకు ఎఫైర్ ఉందని.. అందుకే నా బర్త్ డేకి వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. నాకు ఫ్రెండ్ కాబట్టి వచ్చింది. ఆమె ఒక్కతే రాలేదు.. బాంబే నుంచి, చైన్నై నుంచి చాలా మంది సెలబ్రెటీలు వచ్చారు. నేను ఒకవేళ ఎవరితోనైనా రిలేషన్లో ఉంటే చెప్పేస్తాను. నాకు హైడ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఉంటే కచ్చితంగా చెప్పేవాడిని అంటూ చెప్పుువచ్చారు.

బిపాస నేను జస్ట్ ఫ్రెండ్స్... మా మధ్య ఏమి లేనప్పుడు ఎందుకు రాయడం.. ఉంటే నేనే చెప్తాను అప్పుడు రాసుకోండి.. అంటూ తెలిపారు. నాకు బాంబేలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో బిపాస ఒకరు.. అంటూ వివరించాడు. రానా చెప్పిన ఈ కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి. అయితే గతంలో బోల్డ్ బ్యూటీ బిపాసతో రానా లవ్ ఎఫైర్ అంటూ వార్తలు రాగా.. అలాంటిది ఏమి లేదని చెప్పుకువచ్చాడు.
ఇక రానా విషయానికి వస్తే... మిహికా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి 2020లోనే పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిపై కూడా గతంలో విడాకులు అంటూ ప్రచారం జరిగినా ఆ వార్తలకు రానా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. రానా హీరో నిఖిల్ స్పై సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. ప్రస్తుతం హిరణ్య కశ్యప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమానే కాకుండా తమిళ్ లో రజినీకాంత్ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా పలు ప్రాజెక్టులు కూడా చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











