టాలీవుడ్ హీరోకు ఆరోగ్య సమస్యలు.. ఊపిరి ఆడక పోవడంతో..

ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. అష్టైశ్వర్యాలు, వేల కోట్ల ఆస్తులు ఉండి ఏం ఉపయోగం.. అవన్నీ నీ ఆకలిని తీర్చడానికి ఉపయోగపడనప్పుడు. అందుకే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దలు అంటూ ఉంటారు. మన హీరో, హీరోయిన్లు కోట్ల రూపాయల రెమ్యనరేషన్, యాడ్స్ రూపంలో మరిన్ని కోట్లను వెనకేసుకుంటున్నారు. బయటికెళ్తే కిక్కిరిసిపోయే రోడ్లు, రికార్డులు, రివార్డులు, అవార్డులు ఇలా ఒకటేమిటీ అన్ని రకాల వైభవాలను అనుభవిస్తున్నారు. కానీ కొన్ని అరుదైన వ్యాధులతో మాటల్లో చెప్పలేని బాధలు పడుతున్నారు.. పంటి బిగువున కష్టాన్ని భరిస్తూ పైకి నవ్వుతున్నారు.

కొద్దినెలల క్రితం అగ్ర కథానాయిక సమంత .. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని బహిరంగంగా చెప్పడంతో మిగిలినవారికి కూడా ధైర్యం వచ్చింది. తమ అనారోగ్యాన్ని గురించి చెబితే ఎక్కడ అవకాశాలు కోల్పోతామో, కెరీర్ ఇంతటితో ఎండ్ అయిపోతుందేమోనని భయపడ్డారు. ఈ క్రమంలో సమంత ఇచ్చిన ధైర్యంతో నటీనటులు ఓపెన్ అవుతున్నారు. గోవా బ్యూటీ ఇలియానాకు డిస్‌మార్ఫిక్ బాడీ డిజార్డర్, స్నేహా ఉల్లాల్‌కు ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అనుష్క శర్మకు మానసిక ఆరోగ్య సమస్య, సోనం కపూర్‌కు డయాబెటీస్, నయనతారకు స్కిన్ డిజార్డర్, దీపికా పదుకొనే డిప్రెషన్‌ ఉందని వెల్లడించారు. ఈ లిస్ట్‌లో చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నా ఇంకా బయటపడటం లేదు.

hero sandeep kishan suffering from such a health problem

ఇదిలాఉండగా.. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు సందీప్ కిషన్. ఆయన మేనమామలు చోటా కే నాయుడు, శ్యామ్ కే నాయుడు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి సినిమాటోగ్రాఫర్‌లుగా వెలుగొందుతున్నారు. వారి అడుగుజాడల్లోనే సినీరంగంలో అడుగుపెట్టారు సందీప్. వైవిధ్యానికి పెద్ద పీట వేసే ఈ యువ హీరో హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి తన మార్క్ చూపించారు. స్నేహగీతం, ప్రస్థానం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రారా కృష్ణయ్య, బీరువా, జోరు, టైగర్, నగరం వంటి సినిమాలు సందీప్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.

ఈ ఏడాది ఊరు పేరు భైరవ కోన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రాయన్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ మూవీలో మెయిన్ లీడ్.. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ దక్కించుకున్నాడు సందీప్ కిషన్. స్వయంగా ధనుష్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడంతో ఇండస్ట్రీలో రాయన్‌పై భారీ అంచనాలున్నాయి. జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

hero sandeep kishan suffering from such a health problem

దీంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తోంది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ కిషన్ మాట్లాడుతూ రాయన్ షూటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన, తన అనారోగ్యం గురించి చెప్పారు. ఓ రోజు పొగ, డస్ట్‌తో ఉన్న సీన్స్ చేయాల్సి వచ్చిందని.. అయితే తనకు సైనస్, బ్రీతింగ్ సమస్యలు ఉండటంతో ఊపిరి ఆడలేదని సందీప్ తెలిపారు. తన ఇబ్బందిని గుర్తించిన రాయన్ మూవీ మేకర్స్ కంగారుపడి అంబులెన్స్ తెప్పిస్తామని చెప్పారని.. కానీ తాను అదేమీ అక్కర్లేదని కాసేపు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే చాలని చెప్పి బయటకు వచ్చి రెస్ట్ తీసుకున్నానని సందీప్ కిషన్ వెల్లడించారు. కాసేపటి తర్వాత వచ్చి తన సీన్ కంప్లీట్ చేశానని.. అయితే కాళిదాసు మాత్రం పడిపోయి, మళ్లీ లేచాడని గుర్తుచేసుకున్నారు. దీంతో సందీప్ కిషన్‌ అనారోగ్యంపై ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: sandeep kishan raayan dhanush
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X