ప్రాణాలకు తెగించాను.. ఊపిరి ఆడలేదు.. వజ్ర కవచధర గోవింద కోసం ఆ గుహల్లోకి.. సప్తగిరి

Recommended Video

Saptagiri Comments On Vajra Kavachadhara Govinda Movie || Filmibeat Telugu

సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మళ్లీ గోవింద నామస్మరణతో కమెడియన్ హీరో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మాతలుగా సప్తగిరి నటించిన వజ్రకవచధర గోవిందా చిత్రం మే 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రిలీజ్ డేట్ ప్రకటన, లిరికల్ వీడియో సాంగ్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో సప్తగిరి, నిర్మాతలు నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి, దర్శకుడు అరుణ్ పవార్ పాల్గొన్నారు.

వజ్రం చుట్టూ కథ

వజ్రం చుట్టూ కథ

ఈ సందర్బంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ.. వజ్రం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వజ్రాన్ని కవచంగా ధరించడం వల్ల ఎలాంటి మంచి, నష్టాలు జరిగాయనేది ఈ సినిమా కథ. హీరో లక్ష్యం మంచిదై ఉండొచ్చు. కానీ ఎంచుకొన్న మార్గం కూడా మంచిదై ఉండాలి అనేది ఓవరాల్ పాయింట్. మీ లక్ష్యం మంచిదైనా చెడు మార్గంలో వెళితే చెడే జరుగుతుంది అని కథలో మంచి పాయింట్ చెప్పాం. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు యాక్షన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది అని తెలిపారు.

 ఆక్సిజన్ లేని చోట ప్రాణాలకు తెగించాను

ఆక్సిజన్ లేని చోట ప్రాణాలకు తెగించాను

వజ్రకవచధార గోవిందా సినిమా కోసం ప్రాణాలకు తెగించి ఫైట్స్, యాక్షన్ సీన్లలో నటించాను. చిన్న సినిమా కావడంతో సెట్లు వేయడం ఖర్చుతో కూడినది కాబట్టి.. కర్నూలుకు సమీపంలోని గుహాల్లో షూట్ చేశాం. ఆక్సిజన్ అందని ప్రదేశాల్లో సినిమాను చిత్రీకరించాం. నాతోపాటు హీరోయిన్ కూడా సాహసం చేసింది. హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. గోవిందుడు చుట్టు నా సినిమా టైటిల్స్ తిరుగడం దేవుడి అనుగ్రహం ప్రకారమే జరుగుతున్నది అని సప్తగిరి అన్నారు.

 క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోణంలో

క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోణంలో

నా తొలిసినిమాలో కానిస్టేబుల్ కథ చెప్పాం. రెండో సినిమాలో రైతులు గురించి చెప్పాం. ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ గురించి చెప్పబోతున్నాం. ప్రతీ మండలానికి ఓ క్యాన్సర్ హాస్పిటల్ కడితేనే గానీ ఆ వ్యాధిగ్రస్తులను బతికించుకోలేని పరిస్థితి ఉంది. వజ్రకవచధర గోవింద సినిమాతో వినోదంతోపాటు సామాజిక సందేశాన్ని అందజేస్తున్నాం. సినిమా టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ పెట్టాల్సిన సమయంలో అన్ని రకాల ఆలోచించి.. కథకు సరితూగే టైటిల్ అని డిసైడ్ అయ్యాం. అందుకే భగవంతుడిని స్మరించుకొనే విధంగా ఉంటుందని, అలాగే సెంటిమెంట్ పరంగా ఆ టైటిల్‌‌ను ఫిక్స్ అయ్యాం అని సప్తగిరి చెప్పారు.

సప్తగిరితో మరో మ్యాజిక్ చేయాలని

సప్తగిరితో మరో మ్యాజిక్ చేయాలని

దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయాలని అదే కాంబినేషన్‌తో మళ్లీ వస్తున్నాం. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో కామెడీ, ఎమోషన్స్ ఎంత వర్కవుట్ అయిందో.. అంతే రేంజ్‌లో వర్కవుట్ కావాలని వెయిట్ చేశాం. నోట్ల రద్దు తర్వాత కూడా ఆ సినిమా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. సప్తగిరికి కామెడీ, సినిమాకు ఎమోషన్స్ వర్కవుట్ అయ్యే విధంగా డిజైన్ చేసిన చిత్రమే వజ్రకవచధర గోవింద. సప్తగిరి బాడీలాంగ్వేజ్‌కు తగినట్టుగా రూపొందింది అని అన్నారు.

 మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

ప్రముఖ డిస్టిబ్యూటర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ.. సీడెడ్, ఇతర ఏరియాలో 35 ఏళ్లుగా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా ఉన్నాను. సప్తగిరి సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో స్వయంగా చూసిన దాఖలాలు ఉన్నాయి. సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకొన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. కానీ వజ్రకవచధర గోవింద టీజర్ చూసిన తర్వాత ఎలాగైనా తీసుకోవాలని అనుకొన్నాను. ఫ్యాన్సీ రేటుకు వరల్డ్ వైడ్ రైట్స్ దక్కించుకొన్నాను. సినిమాను ఇప్పటికే చూశాను. ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చింది. వజ్రకవచధర గోవింద పెద్ద హిట్ అవుతుంది. ఏపీ మొత్తం సొంతంగా రిలీజ్ చేయబోతున్నాను. ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

సప్తగిరితో సినిమా చేయాలని మాత్రమే

సప్తగిరితో సినిమా చేయాలని మాత్రమే

నిర్మాత జీవిఎన్ రెడ్డి.. సప్తగిరి సినిమాకు డబ్బులు వస్తాయో రావో అనే విషయాన్ని పట్టించుకోలేదు. సప్తగిరితో సినిమా చేయాలని వచ్చాం. సినిమా ఫీల్డ్‌తో సంబంధం లేకుండా సప్తగిరితో మూవీ చేయాలని వచ్చాం. కర్నూలు గుహల్లో ప్రాణాలకు తెగించి హీరో సప్తగిరి నటించాడు. హీరో కష్టాలు చూసి కర్నూల్ నుంచి ఆక్సిజన్ సిలెండర్లు తెప్పించాం. డబ్బులకు కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం. సినిమా బ్రహ్మండంగా వచ్చింది. కొత్త నిర్మాతలను మీరు ఆదరించాలి. మరిన్నీ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. ఏప్రిల్ 27న సాయంత్రం వజ్రకవచధర గోవింద లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X