బన్నీ టచ్ చేస్తే అంతే... సాయి పల్లవిపై ఆ రూమర్స్ నిజం కాదు: శర్వానంద్

Recommended Video

Hero Sharwanand Superb Speech @Padi Padi Leche Manasu Pre Release Event | Filmibeat Telugu

శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా హను రాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చితరం 'పడి పడి లేచె మనసు'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బేనర్లో చెరుకూరి సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్శమించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.... అందరికీ నమస్కారం, హిట్టు కొట్టనేమో అని టెన్షన్ పడకండి. హిట్టు కొట్టే బాధ్యత నాది. ఈ మధ్య ఇండస్ట్రీలో అందరూ బన్ని బాబుది చాలా గోల్డెన్‌ హ్యాండ్‌ అంటున్నారు. నేను బన్నికి ఫోన్‌ చేసి ' అలా టచ్ చేసి ఇండస్ట్రీలో రెండు హిట్లు విజయ్ దేవరకొండకు ఇచ్చావు.... నన్ను కూడా వచ్చి టచ్‌ చేసి వెళ్లవా! ప్లీజ్' అన్నాను. అడగ్గానే ఓకే చెప్పాడు.

 అది అల్లు అర్జున్ అంటే...

అది అల్లు అర్జున్ అంటే...

ఆయన బిజీ షెడ్యూల్‌లో బాంబేలో బిజీగా ఉన్నాడు. ఎప్పుడు ఫంక్షన్ పెట్టుకోవాలి అని అడిగితే... అంత పెద్ద స్టార్ అయినా.... శర్వా నీ సినిమా రిలీజ్ 21న కాబట్టి దాన్ని బట్టి నేను ఫ్లెక్సిబుల్ గా ఉంటాను, నువ్వు ఎప్పుడంటే అప్పుడుడేట్‌ ఇస్తాను' అన్నాడు. అది అల్లు అర్జున్‌ అంటే... ఈ వేడుకకు వచ్చినందుకు బన్నికి థాంక్స్‌.

ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్

ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్

చాలా మందికి బన్ని ఇన్‌స్పిరేషన్‌. ఎందుకంటే మేమందం మంచి సినిమాలు, డిఫరెంట్‌ సినిమాలు చేస్తాం. కానీ బన్నిలో ఓ క్వాలిటీ ఉండబట్టే మాకంటే ఒక స్టెప్ పైన ఉంటాడు. తను 100కి 150 పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెడతాడు. అది మేము పెట్టం. ఆయన్ను చూసి మా లాంటివారు ఇక్కడి వరకు రావడానికి తను ఇన్‌స్పిరేషన్‌. తనలో ఉన్న మంచి క్వాలిటీ చిన్నా, పెద్దా అని తేడా లేకుండా, మంచి సినిమా వస్తే, హీరోకు, దర్శకుడికి తొలి అప్రిషియేషన్‌ ఫోన్‌ బన్ని నుండే వెళుతంది.

ప్లాప్ డైరెక్టర్‌తో ఎందుకు? అన్నారు

ప్లాప్ డైరెక్టర్‌తో ఎందుకు? అన్నారు

సినిమా విషయానికి వస్తే.. హను 'లై' తీశాడు. ప్లాప్‌ డైరెక్టర్. శర్వా, సాయిపల్లవికి కలిపితే ఇంత మార్కెట్‌ ఉంటుంది. దానికి మించి ఖర్చు ఎందుకు పెట్టారని అందరూ అడుగుతున్నారు. దానికి కారణం సినిమాలోని కంటెంట్. కథపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

మా బ్లడ్ తాగేశాడు

మా బ్లడ్ తాగేశాడు

నా నుంచి సంవత్సరం నుంచి సినిమా రాకవడానికి కారణం ‘పడి పడి లేచె మనసు' లాంటి ఒక మంచి ప్రొడక్టుతో మీ ముందుకు వద్దామనే. నిర్మాతగారు నాకు బ్రదర్‌లా అయిపోయారు. ఇది నా బేనర్ అని చెప్పుకోవచ్చు. హను రాఘవపూడిని అంతా సినిమా పిచ్చోడు అంటారు. నిజంగా మా అందరి బ్లడ్ తాగేశాడు. కొత్త శర్వాను చూపించబోతున్నాడు. నాకు యాక్టింగులో గురువులాగా అయిపోయాడు.

సాయి పల్లవి గురించి మీరు విన్నదంతా సోది

సాయి పల్లవి గురించి మీరు విన్నదంతా సోది

సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గురించి చాలా(రూమర్స్) విని ఉంటారు. అదంతా సోది. ఇంతకంటే డేడికెటేడ్‌ యాక్ట్రెస్ ఉండదు. ఈ సినిమా నాకు సాయి పల్లవి లాంటి మంచి ఫ్రెండ్‌ ఇచ్చింది.

వాళ్ల నాన్న చనిపోయినా...

వాళ్ల నాన్న చనిపోయినా...

మ్యూజిక్ డైరెక్టర్ విశాల్‌ రోజు ఇది. పది రోజుల క్రితం వాళ్ల తండ్రి చనిపోయారు. ఆ బాధను దాచుకుని ఆర్‌ఆర్‌ కంప్లీట్‌ చేశాడు. మధ్య మధ్యలో పక్కకు వెళ్లి ఏడ్చి వచ్చేవాడు. తన డేడికేషన్‌కి హ్యాట్సాఫ్‌. జె.కె సినిమాటోగ్రఫీ అద్భుతం. బన్నీ కూడా విజువల్స్ చూసి బావున్నాయి అన్నాడు. కె.కెగారు చాలా మంచి లిరిక్స్‌ అందించారు.

నా తమ్ముడి సినిమా కూడా హిట్ చేయండి

నా తమ్ముడి సినిమా కూడా హిట్ చేయండి

21న మా సినిమాతో పాటు నా తమ్ముడు వరుణ్‌తేజ్‌ సినిమా అంతరిక్షం కూడా విడుదలవుతోంది. క్రిస్మస్‌ సీజన్‌ పదిరోజుల సెలవులున్నాయి. రెండు సినిమాలు చూడండి. రెండు సినిమాలను హిట్‌ చేయండి'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X