twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో శర్వానంద్‌కు 11 గంటల సర్జరీ.. ఇక 2 నెలలపాటు..

    |

    యువ హీరో శ‌ర్వానంద్‌ 96 షూటింగ్‌ సందర్భంగా గాయపడటం తెలిసిందే. థాయ్ లాండ్‌లో చికిత్స అందించి వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం (జూన్ 17 తేదీ) శర్వానంద్‌ భుజానికి సర్జరీ నిర్వహించారు. దాదాపు 11 గంటలపాటు సర్జరీ జరిగింది. సర్జరీ అంతా సవ్యంగా జరిగింది అని సన్‌షైన్ వైద్యులు వెల్లడించారు. భుజానికి జరిగిన సర్జరీ నుంచి కోలుకోవడానికి రెండు నెలలు బెడ్ రెస్ట్ అవసరం అని వైద్యులు పేర్కొన్నారు.

    శర్వానంద్ ప్రమాదం గురించి వెల్లడిస్తూ.. షూటింగ్‌లో భాగంగా మంచి ట్రైన‌ర్స్ ఆధ్వ‌ర్యంలో శ‌ర్వానంద్ రెండు రోజులు థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ స‌మ‌యంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. కాళ్ల‌పై ల్యాండ్ కావాల్సిన వ్య‌క్తి భుజాల‌ను మోపి ల్యాండ్ అయ్యారు. ఆ కార‌ణంగాషోల్డ‌ర్ డిస్ లొకేట్ అయ్యింది. కాలు కూడా స్వ‌ల్పంగా ఫ్రాక్చ‌ర్ అయ్యింది.

    Hero Sharwanand surgery successful

    ఈ ఘ‌ట‌న త‌ర్వాత శ‌ర్వానంద్ వెంట‌నే థాయ్‌లాండ్ హైద‌రాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. శ‌ర్వాను ప‌రీక్షించిన డాక్ట‌ర్లు భుజానికి బ‌ల‌మైన గాయం త‌గ‌లింద‌ని, కాబ‌ట్టి శస్త్ర చికిత్స అవ‌స‌రమ‌ని సూచించారు అని ఆయన పీఆర్ వర్గాలు తెలిపాయి.

    English summary
    Hero Sharwanand met accident in Tahiland. His shoulder was dislocated and leg was factured. So he underwent a successful shoulder surgery almost for 11 hours. He was suggested two months of bed rest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X