గర్ల్‌ఫెండ్‌తో అలా మీడియాకు చిక్కి.. బాలీవుడ్ మీడియాపై చిందులేసిన సిద్దార్థ్

బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరీతో హీరో సిద్దార్థ్ తాజా ప్రేమ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదితి, సిద్దార్థ్ కొద్ది నెలలుగా చిలకా గోరింకాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంటపడతున్నది. అయితే తమ డేటింగ్ వ్యవహారం మీడియాకు చిక్కడం సిద్దార్థ్‌కు ఇష్టం లేదనే విషయం స్పష్టమవుతుంది. అయితే కొద్ది రోజుల క్రితం తనను వెంటాడుతున్న మీడియాపై సిద్దార్థ్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

సిద్దార్థ్ లైఫ్‌లో బ్రేకప్స్

సిద్దార్థ్ లైఫ్‌లో బ్రేకప్స్

గతంలో సిద్ధార్థ్‌కు పలువురు హీరోయిన్లతో అఫైర్లు కొనసాగాయనే విషయం అందరికీ తెలిసిందే. తన కెరీర్ ఆరంభం నుంచి సోహా ఆలీఖాన్, శృతి హాసన్, సమంత రుత్ ప్రభు, అలాగే కన్నడ హీరోయిన్‌ దీప్తి సన్నిధితో కూడా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన విషయం మీడియాలో ప్రముఖంగా కనిపించింది. అయితే దీప్తి సన్నిధితో డేటింగ్ తర్వాత కూడా కొంతమంది హీరోయిన్లతో సిద్దూ చనువుగా ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి.

అదితిరావు హైదరీతో డేటింగ్

అదితిరావు హైదరీతో డేటింగ్

అయితే అలాంటి రూమర్లకు తెరదించుతూ.. ప్రస్తుతం అదితిరావు హైదరీతో సిద్దార్థ్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని సమాచారం. దాదాపు నాలుగైదు నెలలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ముంబైలోని పలు రెస్టారెంట్స్‌లో అదితి, సిద్దార్థ్ చేసిన హంగామా బాలీవుడ్ మీడియాలోను, సోషల్ మీడియాలోను కనిపించింది. వీరిద్దరూ కలిసి మీడియా కంటికి చాలాసార్లు కనిపించారు.

ముంబైలో జోరుగా షికార్లు

ముంబైలో జోరుగా షికార్లు

అయితే సిద్దార్థ్ ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా కంటపడ్డాడు. అయితే మీడియా కెమెరాలు తనను వెంటాడుతుండటంతో అసహనం వ్యక్తం చేశారు. అయినా మీడియా వెంబడిస్తూ సిద్దార్థ్‌ను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించింది. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకు ముఖం చాటేశారు.

మీడియాపై సిద్దార్థ్ సీరియస్

మీడియాపై సిద్దార్థ్ సీరియస్

సిద్దార్థ్ వద్దని వారిస్తున్నప్పటికీ మీడియా అతడి వెంటపడింది. నేను మర్యాదగా చెబుతున్నాను. నన్ను వదిలేయండి. నేను ఇక్కడి వాడిని కాదు. ఇక్కడి వాళ్ల ఫోటోలు తీసుకోండి. నా ఫోటోలు, వీడియోలు తీయకండి. ప్రస్తుతం డీసెంట్‌గా చెబుతున్నాను. నన్ను వదిలేయండి. మరోసారి ఇలా చేస్తే నేను చెప్పే పద్దతి వేరేలా ఉంటుంది అని సిద్దార్థ్ ఘాటుగా స్పందించాడు. కొద్ది నెలల క్రితానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.

అదితిరావు, సిద్దార్థ్ కెరీర్ ఇలా..

అదితిరావు, సిద్దార్థ్ కెరీర్ ఇలా..

అదితి రావు హైదరీ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల మహా సముద్రం, హే సినామిక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రస్తుతం గాంధీ టాక్స్ అనే చిత్రంలో నటిస్తున్నది. అలాగే జూబ్లీ, హీరామండి వెబ్ సిరీస్‌లో నటిస్తున్నది. సిద్దార్థ్ కెరీర్ విషయానికి వస్తే. మహా సముద్రం చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X