నేనూ మీ తెలుగు బిడ్డనే.. టక్కర్‌ను ఆదరించండి.. సిద్దార్థ్ ఎమోషనల్

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం టక్కర్. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

ప్రమోషన్‌లో భాగంగా టక్కర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దార్థ్ మాట్లాడుతూ..

Hero Siddharth emotional speech at Takkar Movie pre release event

హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం, టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను మంచి స్కేల్ లో తీశారు. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ ఈ యాక్షన్ స్టోరీ మధ్యలో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ను చూపించారు కార్తీక్ జి. క్రిష్ గారు. ఈ సినిమాలో లవర్ బాయ్ రగ్గడ్ గా ఉంటే ఎలా ఉంటుందో చూపించారు. ఇక్కడికి వచ్చిన అతిధులు అందరికి థాంక్యూ సో మచ్. నేను రామానాయుడు గారితో చాలా సార్లు మాట్లాడాను. నాకు సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సురేష్ బాబు గారి వచ్చి ఈ టీం ను బ్లేస్ చేసినందుకు థాంక్యూ సో మచ్ అని అన్నారు.

తెలుగు సాహిత్యం , తెలుగు కవిత్వం చూసి , చదివి అది నా లోపలకి వెళ్ళిపోయింది. సో నేను చెప్పిన చెప్పకపోయినా నేను మీ తెలుగు బిడ్డేనే. నన్ను ఆదరించండి. జూన్ 9న టక్కర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా 100% అలరిస్తుంది. త్వరలో నేను 6 సినిమాలు రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. టెక్నీకల్ టీం కి థాంక్యూ సో మచ్. దివ్యాంశ కి ఈ సినిమా తరువాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సిద్దు ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా అని సిద్దార్థ్ అన్నారు.

Hero Siddharth emotional speech at Takkar Movie pre release event

దర్శకుడు కార్తీక్ జీ క్రిష్ మాట్లాడుతూ.. టక్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన మీడియా మిత్రులకి , టీజీ విశ్వప్రసాద్, వివేక్ గారికి అందరికి నమస్కారం. ఈ సినిమాలో యూనివర్సల్ కంటెంట్ ఉంది.
ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి మూడు కారణాలు, మొదటది మీ సిద్దార్ధ్ , తరువాత దివ్యాంశ అని అన్నారు.

మా గురువు గారు శంకర్ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడే అదే బాటలో శిష్యుడు సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ కాలానికి ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది. ఈ సినిమాను థియేటర్ లో చూసి ఎంకరేజ్ చెయ్యండి అని దర్శకుడు కార్తీక్ జీ క్రిష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X