నాని సినిమా గురించి క్రేజీ న్యూస్.. హీరో సిద్ధార్థ్ సంచలన నిర్ణయం!
నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. నాని ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో. కానీ నాని నటించిన గత రెండు చిత్రాలు కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ కమర్షియల్ గా రాణించలేకపోయాయి. దీనితో తదుపరి చిత్రం కోసం నాని విభిన్నమైన కథని ఎంచుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శత్వం వహిస్తున్న జెర్సీ చిత్రంలో నాని క్రికెటర్ గా నటిస్తున్నాడు.
ఈ చిత్రం తరువాత నాని ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఓ చిత్రం చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో హీరో సిద్దార్థ్ విలన్ పాత్రలో నటినచబోతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ థ్రిల్లర్ కథాంశంతో హీరో, విలన్ పాత్రలని అద్భుతంగా రూపొందించారట.

తెలుగు ఆడియన్స్ కు సిద్ధార్థ్ లవర్ బాయ్ గా బాగా తెలుసు. విలన్ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి. నాని ఇప్పటికే ఈ చిత్రం కోసం లుక్ టెస్ట్ లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











