తిరిగి వెళ్లి టీ స్టాల్ పెట్టుకొంటా.. నరేంద్రమోడీ ట్వీట్‌పై హీరో సిద్దార్థ్ సెటైర్
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనావైరస్ పరిస్థితులపై హీరో సిద్దార్థ్ గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి వివాదాస్పదమైన ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌పై వివాదాస్పదంగా ట్వీట్ చేశారు. హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే...
గతంలో నరేంద్రమోదీ చేసిన ట్వీట్‌ను హీరో సిద్దార్థ్ ట్యాగ్ చేశారు. 2014లో నరేంద్రమోదీ.. భారత్‌కు బలమైన ప్రభుత్వం అవసరం ఉంది. మోడీ అనే వ్యక్తి అసలు మ్యాటర్ కాదు. ఒకవేళ విజయం సాధించలేకపోతే.. తిరిగి వెళ్లి టీ స్టాల్ పెట్టుకొంటాను. కానీ దేశం సమస్యల్లో కూరుకుపోవద్దనేది నా అభిప్రాయం అని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌పై సిద్దార్థ్ స్పందిస్తూ.. ఈ మనిషి చెప్పిన ప్రతీ పాయింట్‌తో నేను ఏకీభవిస్తాను. మీరు కూడా నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. సిద్దార్థ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హీరో సిద్దార్థ్ కెరీర్ విషయానికి వస్తే.. గత కొద్దికాలంగా వరుస ఫ్లాప్‌లను అందుకొన్న ఈ హీరో ప్రస్తుతం తన కెరీర్‌ను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా RX100 దర్శకుడు రూపొందిస్తున్న మహాసముద్రం చిత్రంలో శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











