twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాష్ట్రపతి పాలన పెట్టాలి.. ప్రధాని దేశానికి పట్టిన కోవిడ్ అంటూ హీరో సిద్దార్థ్ ట్వీట్స్

    |

    దక్షిణాదిలో చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు పొందిన హీరో సిద్దార్థ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడుతున్నారు. పరోక్షంగా ప్రధానిపై విమర్శలు ఎక్కుపెడుతూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. తాజాగా దేశంలో కోవిడ్ పరిస్థితుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో తన మాటలకు మరింత పదును పెట్టారు. వరుస ట్వీట్లతో సిద్దార్థ్ మోత మోగిస్తున్నారు. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..

    నా ట్వీట్లకు వస్తున్న రియాక్షన్ చూస్తే.. దామోదర్ కోవిడ్ కంటే రామ్‌నాథ్ కోవింద్ ప్రతిభవంతుడిగా, పాలనాధక్షుడిగా కనిపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాధ్యకుడిపైనే నాకు బలమైన నమ్మకం కలిగిస్తున్నది అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.

    Hero Siddharth Satires on PM Modi and demand President rule in the country

    ఇండియాలో అధ్యక్ష పాలన పెడితే బాగుంటుందనే విధంగా ట్వీట్ చేశారు. కోవిడ్‌ కంటే రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పాలనలోనే బతికి బయటపడే అవకాశం కనిపిస్తున్నది అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

    దేశంలో కరోనావైరస్ పరిస్థితులు పెరిగిపోతున్న సమయంలో జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగంపై పలు వర్గాల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్, హీరో సిద్దార్థ్ తదితరులు ప్రధానిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

    English summary
    Hero Siddharth made Satires on PM Narendra Modi and demand President rule in the country. He tweeted that, Can we have President's rule in India? We might have a better chance of survival with Kovind than Covid.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X