twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బతికే చాన్స్ ఇవ్వండి.. వైఎస్ జగన్ సర్కార్‌పై హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు!

    |

    ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ ధరలను నిర్ణయిస్తూ ఓ చట్టం చేసిన చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా గతంలో బెనిఫిట్ షోలకు ఉన్న అనుమతులు కూడా రద్దు చేసారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖుల వ్యతిరేకిస్తూ ఉండగా ఇప్పుడు వారి జాబితాలో సిద్ధార్థ్ చేరారు. ఆ వివరాల్లోకి వెళితే..

    అన్నింటికీ ఒకేలా

    అన్నింటికీ ఒకేలా

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ మూవీ టికెటింగ్ విధానాన్ని, సహా కొత్త రేట్లకు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. కొత్త చట్టం అమల్లోకి రావడంతో రాష్ట్రంలో సినిమా టికెట్ల విక్రయం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగనుంది. అలాగే రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయడంతో పాటు ఏ సినిమాకైనా టికెట్ల ధరలు పెంచేది లేదని.. అన్నింటికీ ఒకేలా ఉంటాయని కూడా పేర్కొన్నారు.

     నిలదొక్కు కోగలుగుతుంది

    నిలదొక్కు కోగలుగుతుంది

    ముందు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ "పరిశ్రమ కోరిన విధంగా పారదర్శక కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమా ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాలు బతుకుదెరువు కోసం, తగ్గించిన టికెట్ రేట్స్ ని కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా ట్యాక్సులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కు కోగలుగుతుంది'' అని చిరు ట్వీట్ చేశారు.

    బ్లాక్ టికెట్ దందా

    బ్లాక్ టికెట్ దందా

    ఆ తరువాత ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు సినిమా టికెట్స్ ధరలు, షోలపై స్పందిస్తూ..నాకు ఇండస్ట్రీలో ఉన్న అనుభవంతో చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి తన అభిప్రాయాలు కొన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన సుదీర్ఘంగా పెద్ద పోస్ట్ చేశారు. అందులో టికెట్ రేట్ల తగ్గింపు, ఆన్ లైన్ టికెట్ విధానం, బ్లాక్ టికెట్ దందాలు గురించి మాట్లాడారు.

    ఎందుకు అంత శ్రద్ధ?

    ఎందుకు అంత శ్రద్ధ?

    టికెట్ రేట్లు పెంచి ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమలు పరిచితే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని సూచించారు. ఇక తాజాగా హీరో సిద్ధార్థ్ సినిమా టికెట్ ధరల నిర్ణయం మీద స్పందించారు. తాజాగా టాలీవుడ్ ఏపీ ప్రభుత్వ విధానాలపై హీరో సిద్దార్థ్ మండిపడ్డారు. ఓ రెస్టారెంట్‌కు ప్లేట్ ఇడ్లీ, కాఫీ ఎంత రేటు ఉండాలో మీరు చెప్పరు కానీ, సినిమా పరిశ్రమ మీకు ఎందుకు అంత శ్రద్ధ?, వాళ్ల పెట్టుబడిని వాళ్లు రికవరీ చేసుకుంటా

    Recommended Video

    Choreographer Siva Shankar ఆరోగ్యం విషమం, ఆర్డిక సాయం కోసం.. జాతీయ అవార్డు గ్రహీత | Filmibeat Telugu
    బతికే చాన్స్ ఇవ్వండి.

    బతికే చాన్స్ ఇవ్వండి.

    టికెట్ రేట్ల మీద వచ్చిన జీవో, అదనపు షోలను రద్దు చేయడమనేది ఎంఆర్పీటీ వయలేషన్స్ కిందకు వస్తుందన్న ఆయన దయచేసి సినిమా, సినిమా హాళ్లకు బతికే చాన్స్ ఇవ్వండి. థియేటర్ రెంట్, ఎంత పెట్టుబడి పెడుతున్నారు.. ఆ ఏరియా బట్టి సరైన రేటును డిసైడ్ చేయండని ప్రభుత్వాలకు సిద్దార్థ్ సూచించారు. ఏపీలో సినిమా టికెట్ ధర కప్పు టీ కంటే చీప్ అయింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

    English summary
    Hero Siddharth slams Government And Politicians on ap tickets issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X