స్టార్ హీరోలవి ఈఎంఐల బతుకులే... హీరో శివాజీ షాకింగ్ కామెంట్స్
ఐ బొమ్మ రవి అరెస్ట్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఆయనను సపోర్ట్ చేసేవారు కొందరైతే, ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసేవారు మరికొందరు. అయితే టికెట్ల రేట్లు, థియేటర్‌లో పరిస్ధితులు మరోసారి చర్చకు వస్తున్నాయి. టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉంటే ఐ బొమ్మ రవి లాంటి వ్యక్తులు వచ్చేవారు కాదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ రవి అరెస్ట్, ఇండస్ట్రీలోని పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు హీరో శివాజీ. ఓ ప్రముఖ తెలుగు వార్తాసంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
చిన్న సినిమాలకు ఇబ్బందే
పెద్ద సినిమాలు ఏడాదికి నాలుగో ఐదో వస్తాయి.. సంక్రాంతి పండక్కి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. కంటెంట్ బాగున్న ప్రతి సినిమాకు ఆడియన్స్ వస్తున్నారు. పెద్ద సినిమాలు రిలీజయ్యే టైంలో వచ్చే చిన్న సినిమాలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. ఇండస్ట్రీ పత్తిత్తు అని ఎప్పుడూ చెప్పను.. ఎవరు తప్పు చేశాడో వాడి గురించే మాట్లాడండి, మొత్తాన్ని అందులో కలపొద్దు. హైదరాబాద్‌లో 400 థియేటర్లు ఉన్నాయి.. ఏఎంబీ మాల్‌లో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో, వాటిలో రేట్స్ అమానుషం. దానికి సినిమాకి సంబంధం లేదు. ఒక వోల్వో బస్ కొనడానికి కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని శివాజీ అన్నారు.

బస్సు టికెట్లు పెంచుకోవచ్చా?
విజయవాడ నుంచి హైదరాబాద్ దూరం 270 కిలోమీటర్లు.. ఒక టికెట్‌కు 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు, అందులో 40 మంది పడతారు. రాను బోను కలిపి 80 మంది.. నెలకు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల ఆదాయం. వాళ్ల ఖర్చులు 8 నుంచి 9 లక్షలు అవుతాయి. ఏడాదిలో బండిపై పెట్టిన ఖర్చు వచ్చేస్తుంది. సంక్రాంతి పండక్కి బస్ టికెట్ ధర 2 వేల రూపాయలే ఉంటుందా? ఒక పేదవాడు హైదరాబాద్ నుంచి వాడి సొంతూరికి వెళ్లాలంటే ఒక్కో టికెట్ ధర 4 వేలు, 5 వేలు పైనే. మరి ప్రజల గురించి మాట్లాడేవారికి మూగబోయిందా? మీరు ఫైట్ చేస్తోన్న పాప్‌కార్న్ ఏంటో తెలుసా? థియేటర్‌లో దొరికే పాప్‌కార్న్ హెల్దీయా అని మీరు కొట్టండి. సిగరెట్ తాగొద్దన్నారు.. తాగకుండా ఉంటున్నారా? అని శివాజీ నిలదీశారు.
ఆ సినిమాకు థియేటర్స్ లేవు
150 నుంచి 200 రూపాయల లోపు సినిమా టికెట్ ఉంది. థియేటర్‌లో సౌకర్యాలన్నీ ఇవ్వడానికి వాడు రేట్లు తగ్గడం కుదరదు అంటాడు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు 100 రూపాయల టికెట్ పెడితే.. కొన్ని థియేటర్స్ ఇవ్వము అంటున్నారు. ఇందులో సినిమా వాడి తప్పేముంది? ఎక్కడో ఊరిలో ఉన్న నన్ను ఇంతదూరం తీసుకొచ్చిన ప్రజలకి, నన్ను దూరం చేయాలనుకోవడం మీ భ్రమ. ప్రజలకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి నేను అండగా నిలబడ్డ.. పాలెం బస్సు దుర్ఘటన సమయంలో ఫైట్ చేశా? మీరు నా లాగా ఫైట్ చేయగలరా? అని శివాజీ నిలదీశారు.
లగ్జరీ లైఫ్ ఎవరికీ లేదు
ఐ బొమ్మ రవి చెడ్డొడా? మంచోడా? చెడ్డ పని చేశాడా? మంచి పనిచేశాడా? అని చెప్పడానికి నేనెవరినీ, నాకు సంబంధం లేదు. ఈ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం.. న్యాయస్థానాలు, పోలీసులు, చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ప్రతిదానికి సినిమా, వాళ్లు, వీళ్లు... అసలు సినిమాకు, మాల్స్‌కు సంబంధం లేదు. ఇప్పుడు మాల్స్‌లోకి వెళితే.. గేమ్స్ ఆడితే డబ్బులు కూడా అందులోనే కట్టించుకుంటున్నారు. దానికి సినిమాకి ఏం సంబంధం, ఆ రేట్లు మాల్ వాడి ఇష్టం. సుప్రీంకోర్టుకు వెళితే... రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోమని చెప్పిందే కానీ న్యాయస్థానం మాత్రం జీవో జారీ చేయలేదు. అంటే ఏదో లాబీ పనిచేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.
నేను అన్న ఒక మాటను తీసుకుని ప్రజలంటే అంత చులకన అని అంటున్నారు. వీళ్లా నాకు చెప్పేది ప్రజలంటే.. 13 సంవత్సరాలు నేను ప్రజల కోసం ఫైట్ చేసినోడిని. ఇండస్ట్రీలో విపరీతమైన డబ్బుంది, విపరీతమైన లగ్జరీ అనుభవిస్తున్నారనేది ఒక మిథ్య. 95 శాతం మంది ఇండస్ట్రీ వాళ్లు త్రీ బెడ్‌రూం అపార్ట్‌మెంట్స్‌లోనే ఉంటున్నారు, హీరోలతో సహా. ఒక్క 5 శాతం మంది మాత్రమే ఆ లగ్జరీ కనిపిస్తోంది. ఈఎంఐల మీదే బతికేవారే అనేది వాస్తవం అని శివాజీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











