ఆ సినిమాకు బెదిరింపు కాల్స్.. కొన్నాళ్ళు గన్ జేబులో పెట్టుకొని తిరిగా: హీరో శ్రీకాంత్
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్యామిలీ సినిమాలతో ఒకప్పుడు మంచి క్రేజ్ అందుకున్న వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. అప్పట్లో శ్రీకాంత్ కు లేడిస్ లో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా ఉండేవారు. అయితే ఒకానొక దశ తరువాత హీరోగా శ్రీకాంత్ మార్కెట్ రేంజ్ తగ్గడంతో సపోర్టింగ్ రోల్స్ నెగిటివ్ విలన్ క్యారెక్టర్లు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఒక సినిమా కారణంగా తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆ సమయంలో కొన్ని రోజుల వరకు గన్ జేబులో పెట్టుకొని తిరిగినట్లు చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాలతో బిగ్ హిట్స్
శ్రీకాంత్ కెరీర్ మొదట నెగిటివ్ రోల్స్ తోనే మొదలైంది. చిన్న తరహా నెగిటివ్ రోల్స్ చేసిన అనంతరం అతను మెల్లగా ఫ్యామిలీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఆమె, తాజ్ మహాల్, ప్రేయసి రావే, పెళ్లి సందడి, వినోదం, ఊయల, కన్యాదానం ఇలా ఎన్నో ఫ్యామిలి ఎమోషనల్ సినిమాలతో శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా క్రేజ్ అందుకున్నాడు.

మళ్ళీ విలన్ గా..
అయితే కొన్నాళ్ల అనంతరం శ్రీకాంత్ హీరోగా గతంలో మాదిరిగా కమర్షియల్ గా సక్సెస్ లు అందుకోక పోవడంతో ఆయన మార్కెట్ చాలా వరకు తగ్గిపోయింది. అయితే శ్రీకాంత్ వెంటనే తన ఆలోచనా విధానాన్ని మార్చేసి జగపతిబాబు తరహాలోనే మళ్ళీ నెగిటివ్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. మొదట నాగచైతన్యతో యుద్ధం శరణం అనే సినిమాలో భయంకరమైన విలన్ గా చేశాడు కానీ వర్కౌట్ కాలేదు.

అఖండ సినిమాలో..
ఇక కృష్ణవంశీ గోవిందుడు అందరి వాడేలే అనే సినిమాలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసి మంచి క్రేజ్ అందుకున్నాడు. అనంతరం అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో మంచి పాజిటివ్ పాత్రలో నటించి మరింత గుర్తింపు అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమాలో నెగిటివ్ రోల్ కు మరింత భారీ స్పందన వచ్చింది.

బెదిరింపు కాల్స్..
అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ ఒకానొక సందర్భంలో తనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పాడు అయితే కొన్ని రోజుల వరకు జేబులో పెట్టుకొని తిరగాల్సి వచ్చింది అని క్రికెట్ ఆడే టప్పుడు కూడా వుండేది అని శ్రీకాంత్ వివరణ ఇచ్చాడు ఇక సినిమా మరేదో కాదు శ్రీకాంత్ తెలియజేశాడు.

అండర్ గ్రౌండ్ లో దర్శకుడు
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఓ వర్గం వారిని తప్పుగా చూపించారు అంటూ దర్శకుడికి నిర్మాతకు నటీనటులకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. సినిమా లో కొన్ని డైలాగ్స్ కొన్ని మతాల వారిని కించపరిచే విధంగా ఉన్నాయని కూడా ఆరోపణలు రావడంతో కృష్ణవంశీ అప్పట్లో అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది.
Recommended Video

జేబులోనే గన్..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ తనకు కూడా అప్పట్లో చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి అని చెప్పుకొచ్చాడు అయినప్పటికీ తాను ఏమాత్రం భయపడలేదు అని కొన్నాళ్ళపాటు లైసెన్స్ గన్ పెట్టుకొని తిరిగినట్లుగా తెలియజేశాడు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చే దాడి చేస్తారో తెలియదు కాబట్టి క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా గన్ జేబులోనే ఉండేది అని అన్నాడు.


Click it and Unblock the Notifications











