Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించాడని మీకు తెలుసా?

రోషన్ మేక.. హీరో శ్రీకాంత్ వారసుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ మూవీలో తన డ్యాన్సులు, యాక్టింగ్, స్టైల్ తో అదరగొట్టాడు. ఈ మూవీ తర్వాత రోషన్.. మోహన్ లాల్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దానితో పాటు ఛాంపియన్ అనే సినిమాలో కూడా నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. రోషన్ అల్లు అర్జున్ సినిమాలో నటించాడనే విషయం మీకు తెలుసా.. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మొదటి సినిమా నిర్మల కాన్వెంట్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ సినిమాలో రోషన్ చిన్న పిల్లాడిలా ఉన్నాడు.. అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

Hero Srikanth Son Roshan as child artist in Allu Arjuns Anushka, Rana Rudramadevi movie

అయితే కాస్త గ్యాప్ ఇచ్చి.. ఈ కుర్రాడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా... పెళ్లి సందD తెరకెక్కింది. ఇక ఈ మూవీకి గౌరి రోణంకి దర్శకత్వం వహించగా... రాఘవేంద్ర రావు పర్యవేక్షణ చేశారు. ఇక ఈ మూవీలో కన్నడ భామ శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.

రోషన్ కూడా పెళ్లి సందడి సినిమాలో తనదైన స్టైల్, డ్యాన్స్, నటనతో మెప్పించాడు. ఈ మూవీతో రోషన్ కు మంచి పేరు అయితే వచ్చింది. అయితే రోషన్ నిర్మల కాన్వెంట్ కు ముందు ఓ సినిమాలో నటించాడని చాలా మందికి తెలియదు. అది కూడా అల్లు అర్జున్ నటించిన సినిమాలో అంటే.. ఏమై ఉంటుందో అని ఆలోచిస్తారు. అవును నిజమే... అల్లు అర్జున్ సినిమాలో రోషన్ నటించాడు.

Hero Srikanth Son Roshan as child artist in Allu Arjuns Anushka, Rana Rudramadevi movie

అయితే ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. అదేం మూవీ అనుకుంటున్నారా... గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం రుద్రమదేవి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో రానా, అల్లు అర్జున్ కూడా కీలక పాత్రలో నటించి మెప్పించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే.. వాహ్ అనిపిస్తుంది.

ఇక రుద్రమదేవి మూవీలో అల్లు అర్జున్ డైలాగ్ డెలివరికి అందరూ ఫిదా అయిపోయారు. గోనా గన్నారెడ్డిగా అల్లు అర్జున్ సూపర్ స్టైలిష్ గా కనిపించారు. ఇక రుద్రమ దేవి సినిమాలో చిన్నప్పుడు రానా పాత్రలో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించాడు. చిన్నప్పుడు రానా పాత్రలో రోషన్ అదరగొట్టాడు అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో చిన్నప్పుడే రోషన్ సూపర్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం రోషన్ మోహన్ లాల్ తో కలిసి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు ఛాంపియన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X