8 గంటలపాటు కఠోరంగా జిమ్‌లో సుధీర్ బాబు.. రియల్ హీరో ఫీట్లు చూస్తే షాకే!
సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన హీరో సుధీర్ బాబు కొద్దికాలంలోనే విలక్షణమైన సినిమాలతో తనకు తాను ప్రూవ్ చేసుకొన్నారు. ఎస్సెమ్మెస్ చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన ఆయన ప్రేమకథా చిత్రంతో మంచి సక్సెస్ అందుకొన్నారు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నారు. తాజాగా తన సినిమాల కోసం తన శారీరాకృతిని మార్చుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు మీ కోసం..

సుధీర్ బాబు కెరీర్ గురించి
2018లో సుధీర్‌బాబు నటించిన సమ్మెహనం , నన్నుదోచుకుందువటే చిత్రాలు మంచి విజయాన్ని అందుకొన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా మెస్ట్ డిజరబుల్ మెన్‌లో టాప్ 15లో సుధీర్‌బాబు నిలబడటం
విశేషం. అంతేకాకుండా సొంత నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మించడం కూడా జరుగుతున్నది.

బాలీవుడ్‌పై కూడా దృష్టి
అంతేకాకుండా హిందీ సినిమాలపై కూడా దృష్టిపెడుతున్నాడు సుధీర్ బాబు. గతంలో వర్షం సినిమా రీమేక్‌గా తెరకెక్కిన భాగీ అనే చిత్రంలో విలన్‌గా నటించాడు. ఆ చిత్రంలో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించి బాలీవుడ్ వర్గాలను కూడా ఆకట్టుకోవడం గమనార్హం. పలు ప్రాజెక్టుల గురించి ఆఫర్లు ఉన్నట్టు సమాచారం.

రెండు క్రేజీ చిత్రాల్లో
తాజాగా మళ్లీ ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రం V అనే చిత్రంలో నటిస్తున్నాడు. అంతేకాకుండా పుల్లెల గోపిచంద్ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సినిమాలోని పాత్ర డిమాండ్ మేరకు బాడీ, లుక్‌పై ప్రత్యేక శద్దపెట్టారు. ఉదయం 4 గంటలపాటు, సాయంత్రం 4 గంటలపాటు మొత్తంగా 8 గంటలు శ్రమిస్తున్నట్టు సమాచారం. ఇంతగా కష్టపడే హీరోలు తెలుగులో చాలా తక్కువగా ఉంటారని సినీ వర్గాలు పేర్కొంటాయి.

సోషల్ మీడియాలో వైరల్‌గా
సుధీర్ బాబు తాజా ఫొటోలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తున్నది. సుధీర్ హార్డ్ వర్క్ చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంధ్రధనస్సులా శారీరాన్ని వంచారంటూ కామెంట్ చేస్తున్నారు. ఆయన కష్టపడే తీరు సినిమాపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని పలువురు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











