Mahesh Babu : తన పెళ్లి వీడియోను షేర్ చేసిన సుధీర్ బాబు .. 18 ఏళ్లలో మహేశ్‌ ఎంత మారిపోయాడో !

తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసానికి, మంచితనానికి మారుపేరు సూపర్‌స్టార్, నటశేఖర కృష్ణ. తన డేరింగ్, డాషింగ్ డెసిషన్స్‌తో హేమహేమీలనే ఢీకొట్టిన ఆయన సంచలనాలకు మారుపేరుగా నిలిచారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక .. ఆరు నూరైనా ఇచ్చిన మాట మీద నిలబడటం కృష్ణ గారి లక్షణం. ఈ ప్రస్థానంలో ఓటమి ఎదురైనా, పరాజయాలు పలకరించినా కృంగిపోకుండా ఎదురొడ్డి నిలిచారు. తమ సినిమాల వల్ల నష్టాలను ఎదుర్కొన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు హీరోలు రెమ్యునరేషన్ తిరిగిచ్చే ఆనవాయితీకి ఆద్యుడు కృష్ణ. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక సొబగులు అద్ది నేడు హాలీవుడ్ రేంజ్‌కు టాలీవుడ్ వెళ్లడానికి బీజాలు వేసిన వారిలో ఆయన ముందువరుసలో ఉంటారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ సూపర్‌స్టార్ అన్న పదానికి అసలు సిసలు నిర్వచనం కృష్ణ.

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావులు నిర్మాతలుగా రాణించారు. తర్వాత రమేశ్ బాబు , మంజుల, మహేశ్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టి కృష్ణ వారసత్వాన్ని నిలబెట్టారు. ఈ క్రమంలో కృష్ణ చిన్నకుమార్తె ప్రియదర్శిని భర్త సుధీర్‌బాబు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవాడలో పుట్టి పెరిగిన ఆయన అసలు పేరు పోసాని నాగ సుధీర్ బాబు. ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ప్రస్తుత ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ ఆయనకు మంచి మిత్రుడు.

Hero Sudheer babu shares his wedding Album Mahush Babu photos goes viral in social media

మహేశ్ అమ్మమ్మ.. సుధీర్‌బాబు తల్లి మంచి స్నేహితులు కావడంతో కృష్ణ కుటుంబం నుంచి సంబంధం కుదిరింది. 2006లో సుధీర్‌బాబు - ప్రియదర్శినిల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. 2010లో ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు సుధీర్ బాబు. ఆ తర్వాత శివ మనసులో శృతి, ప్రేమ కథా చిత్రం, ఆడు మగాడ్రా బుజ్జి, భలే మంచిరోజు, శమంతకమణి, ఆనందో బ్రహ్మ, సమ్మోహనం, వీ, శ్రీదేవి సోడా సెంటర్, హంట్, మామ మచ్చీంద్ర సినిమాలలో నటించారు.

ఈ ఏడాది ఇప్పటికే హరోం హర మూవీతో ప్రేక్షకులను పలకరించారు సుధీర్ బాబు. ఇందులో సునీల్‌తో కలిసి ఆయన చేసిన నటన ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాలో 1989లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. మే 31న రిలీజైన హరోం హరకు మంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

తాజాగా సుధీర్ బాబు నటిస్తోన్న మరో చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఇందులో ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాయాజీ షిండే, సాయిచంద్, రాజు సుందరం, ఆమని కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వేడుకలో ఉన్నది కాలం.. వేదిక ఈ కళ్యాణం అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ పాటకు తన పెళ్లి నాటి ఫోటోలను కలిపి దానిని వీడియో రూపంలో క్రియేట్ చేశారు సుధీర్ బాబు . ఇందులో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫోటోను చూసిన ఫ్యాన్స్.. ఎంత మారిపోయాడోనంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: sudheer babu mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X