Remuneration 100తో సుహాస్ కెరీర్ స్టార్ట్​ - ఒక్కో సినిమాకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తెలుసా?

షార్ట్ ఫిలిమ్స్​తో కెరీర్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన టాలెంట్ యాక్టర్​ సుహాస్. తన నటనతో ఆకట్టుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కి ఆడియెన్స్​లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగానూ ఎదిగి వరుస హిట్లను అందుకుంటున్నాడు. అయితే ఇతడు తన కెరీర్​ను రూ.100తో మెదలుపెట్టినట్లు చెప్పాడు. ఇన్ని హిట్లు అందుకోవడంతో ఇప్పుడు కోట్ల రూపాయలలో పారితోషికం తీసుకుంటున్నట్లు తాజా ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇంతకీ అతడు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

సుహాస్ ఈ పేరుకు ఇండస్ట్రీలో గిరాకీ పెరుగుతోంది. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్లాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్స్​లో ఎక్కువగా మెప్పించాడు. తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా తన డైలాగ్స్​తో, హావా భావాలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి నేచురల్ యాక్టింగ్​కు ప్రేక్షకులు మెల్లగా కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు.

Hero Suhas started his career with Rs 100 now knows the remuneration for each film See Details Here

దీంతో అతడికి లీడ్​ రోల్​లో నటించే అవకాశం దక్కింది. తన స్నేహితుడి దర్శకత్వంలోనే కలర్ ఫొటో అనే సినిమా చేశాడు. కథ పరంగా తొలి ప్రయత్నంలోనే హీరోగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఇందులో అతడి నేచురల్ యాక్టింగ్, ఎమోషన్ సీన్స్​కు ఆడియెన్స్​ హార్ట్​ఫుల్​గా కనెక్ట్ అయిపోయారు. నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. దీంతో అతడికి క్రేజ్ పెరగడం మొదలైంది.

అయినా కూడా అతడు హీరోగానే కాకుండా ఇతర హీరోల చిత్రాల్లోనూ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ముందుకెళ్లాడు. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. హిట్ 2 అయితే సైకోగా నెగెటివ్ రోల్​లో నటించి అందర్నీ షాక్ చేశాడు. తన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. ఇక అంతే టాలెంటెడ్ యాక్టర్​గా గుర్తింపు మరింత పెరిగిపోయింది. ఇక రైటర్ పద్మభూషణ్ సినిమాతో లేడీ ఆడియెన్స్​ మనసులను తాకాడు. ఇది కూడా ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో హీరోగా మరో మెట్టు ఎక్కుడా సుహాస్.

Hero Suhas started his career with Rs 100 now knows the remuneration for each film See Details Here

అనంతరం ఓ వెబ్‌సిరీస్‌ చేయగా అది కూడా హిట్ అయింది. ఇక రీసెంట్​గా అంబాజీపేట మ్యారేజీబ్యాండు చిత్రంతో అయితే ప్రేక్షకుల మదిని మరోసారి దోచేశాడు. ఈ చిత్రానికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తీసుకొచ్చింది. ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

అయితే ఈ క్రమంలోనే ఓ ప్రెస్ మీట్​లో పాల్గొని తన రెమ్యునరేషన్​, కెరీర్ గురించి మాట్లాడాడు. రెమ్యునరేషన్ పెంచారు అంటకదా అని ఓ విలేకరి అడగగా.. అవును మరి నేను బతకాలి కదా? జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను. రోజుకు రూ.100 తీసుకునేవాడిని. ఆ తర్వాత రూ.1000 నుంచి రూ.3 కోట్లు తీసుకునే వరకు వచ్చాను. అంటూ నవ్వుతూ చెప్పాడు సుహాస్. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Read more about: suhas సుహాస్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X