అరుదైన ఫోటో షేర్ చేసిన సుమంత్.. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్ కోసం!
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం క్రమంగా భారీ రూపం సంతరించుకుంటోంది. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన బాలయ్య లుక్స్ ఎన్టీఆర్ ని తలపిస్తున్నాయి. తన తండ్రి పాత్రలో బాలయ్య ఒదిగిపోయిన నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో పలువురు స్టార్స్ నటిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు పాత్రలో రానా లుక్ ఇటీవలే విడుదలైంది. యంగ్ చంద్రబాబు లుక్ లో రానా అదరగొడుతున్నాడు. ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం రంగం సిద్ధం అవుతోంది. ఏఎన్నార్ పాత్రలో ఆయన మనవడు హీరో సుమంత్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఏఎన్నార్ పాత్రకు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది.

సుమంత్ తన తాజా లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్లీన్ షేవ్ లో కనిపిస్తూ తన తదుపరి చిత్రం కోసమే ఈ లుక్ అని కామెంట్ పెట్టాడు. ఏఎన్నార్ పాత్ర కోసమే సుమంత్ కొత్త లుక్ లోకి మారుతున్నాడు. తాజాగా తన తాత ఏఎన్నార్ తో ఉన్న అరుదైన ఫోటోని కూడా సుమంత్ షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











