twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మకు కనీసం చీర కొనివ్వలేదు.. మా డైరెక్టర్‌ది జెర్సీలో నాని లాంటి స్టోరి.. సందీప్ కిషన్

    |

    సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

    జూలై 12న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాత 'జెమిని' కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు.

    Hero Sundeep Kishan gets emotional about Director Caarthick Raaju

    ఈ సందర్భంగా సందీప్ కిషన్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ...

    మేం ఎంచుకున్న వృత్తి వలన మా కుటుంబాలు ఇబ్బంది పడకూడదని, విజయాలు సాధించాలని తీసిన సినిమా నిను వీడని నీడను నేనే. నేను ఇప్పటివరకూ మా అమ్మకు ఒక్క చీర కూడా కొనలేదు. మా పేరెంట్స్ ఏనాడూ నన్ను ఏదీ అడిగినది లేదు. వాళ్లు బయటకు వెళ్తుంటే.. 'ఏంటి? మీ కొడుకు సినిమా సరిగా ఆడటం లేదట' అనే మాట ఎవరూ అనకుండా ఉంటే చాలు. ఈ సినిమాతో పేరెంట్స్ కి మంచి పేరు తెచ్చిపెడతా అని సందీప్ కిషన్ అన్నారు.

    నిను వీడని నీడను నేనే దర్శకుడు కార్తీక్ రాజుగారిది 'జెర్సీ'లో నాని లాంటి స్టోరీ. ఆయనకు 46 ఏళ్లు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచి సీజీ టెక్నీషియన్. మంచి ఉద్యోగం వదులుకుని దర్శకుడు అవ్వాలని ఎనిమిదేళ్ల క్రితం డిసైడ్ అయితే... ఇంట్లో సపోర్ట్ చేశారు. ఇవ్వాళ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమాలో నాకోసం పాట పాడిన సిద్ధార్థ్, మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్, మా బ్రదర్, ఎడిటర్ చోటా కె ప్రసాద్, మా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివా చెర్రీ, సీతారామ్.. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్ అని సందీప్ కిషన్ పేర్కొన్నారు.

    English summary
    'Ninu Veedani Needanu Nene', the emotional horror entertainer, stars Sundeep Kishan in the lead role. The hero is producing this novel movie on Venkatadri Talkies (Production No. 1) in association with V Studios and Vista Dream Merchants. Directed by Caarthick Raaju, Anya Singh is the female lead. The film will hit the screens on July 12. Its Trailer was launched on Sunday in Hyderabad. Producer 'Gemini' Kiran, and Anil Sunkara graced the occasion as chief guests.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X